సర్ఫరాజ్‌కు ఘోర అవమానం..శరీరాకృతిపై కామెంట్ చేసిన ఫ్యాన్

|

Jun 22, 2019 | 1:00 PM

వరల్డ్ కప్‌లో ఇండియా చేతిలో పాక్ ఘోర పరాభవాన్ని ఆ దేశ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కోర్టులో కేసులు వెయ్యడం, ఫ్లకార్డులతో నిరసన తెలపడం వంటివి చూశాం. అయితే ఆ దేశ కెప్టెన్ సర్ఫరాజ్‌పై మాత్రం ఫ్యాన్స్‌తో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఫైర్ అవుతున్నారు. సర్ఫరాజ్‌కి అసలు బుద్ది లేదని..ఏం టైం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో కూడా తనకు తెలియదని పాక్ మాజీ ఆటగాడు అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా ఓ పాకిస్థాన్ […]

సర్ఫరాజ్‌కు ఘోర అవమానం..శరీరాకృతిపై కామెంట్ చేసిన ఫ్యాన్
Follow us on

వరల్డ్ కప్‌లో ఇండియా చేతిలో పాక్ ఘోర పరాభవాన్ని ఆ దేశ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కోర్టులో కేసులు వెయ్యడం, ఫ్లకార్డులతో నిరసన తెలపడం వంటివి చూశాం. అయితే ఆ దేశ కెప్టెన్ సర్ఫరాజ్‌పై మాత్రం ఫ్యాన్స్‌తో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఫైర్ అవుతున్నారు. సర్ఫరాజ్‌కి అసలు బుద్ది లేదని..ఏం టైం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో కూడా తనకు తెలియదని పాక్ మాజీ ఆటగాడు అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలా ఉండగా ఓ పాకిస్థాన్ ఫ్యాన్ సర్ఫరాజ్‌కు ఝలక్ ఇచ్చాడు. లండన్ లో కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కు వచ్చిన పాక్ కెప్టెన్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగి మరి తిట్టాడు. ‘సర్ఫరాజ్‌ బాయ్‌.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా’  అంటూ అభ్యంతరకర పదజాలం ఉపయోగించాడు. సర్ఫరాజ్‌ మాత్రం సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా వరల్డ్ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఇండియా ఫ్యాన్స్ స్మిత్‌ బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని ఉటంకిస్తూ గ్రౌండ్‌లో  ‘ఛీటర్’, ‘ఛీటర్’ అని గేలి చేసిన విషయం సందర్భంలో కోహ్లి అలా చేయెద్దని..అతనికి మద్దతు తెలుపమని ఫ్యాన్స్‌ను వారించాడు. అదే సందర్భంలో కోహ్లి స్థానంలో మీరుంటే ఎలా రియాక్ట్ అవుతారని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సర్పరాజ్ మాట్లాడుతూ ‘ పాక్ ఫ్యాన్స్ అలా గేలి చేస్తారని నేను భావించడం లేదు. వారు ఆటని, ఆటగాళ్లను ప్రేమిస్తారు’ అని రిప్లై ఇచ్చాడు. అంతలా తాను గొప్పగా చెప్పిన ఫ్యాన్సే సర్ఫరాజ్‌ను తాజాగా కామెంట్స్ చేయడం గమనార్హం.