ఒరేయ్ ఆజామూ.! ఎంత పని జరిగింది.. దెబ్బకు కెప్టెన్సీ పోస్ట్ హుష్‌కాకి.? మరి నెక్స్ట్ ఏంటి

|

Jul 10, 2024 | 9:53 AM

వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్‌ కోచ్‌గా జాసెన్‌ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు, పరిమిత ఓవర్ల క్రికెట్‌ ప్రక్షాళనపైనా..

ఒరేయ్ ఆజామూ.! ఎంత పని జరిగింది.. దెబ్బకు కెప్టెన్సీ పోస్ట్ హుష్‌కాకి.? మరి నెక్స్ట్ ఏంటి
Babar Azam Controversy
Follow us on

వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్‌ కోచ్‌గా జాసెన్‌ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు, పరిమిత ఓవర్ల క్రికెట్‌ ప్రక్షాళనపైనా దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వ్యవహరించిన బాబర్‌ ఆజంపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. సారథిగా అతడిని తప్పించేందుకు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో బాబర్‌ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో టెస్టు పగ్గాలను షాన్‌ మసూద్‌కు అప్పగించిన పీసీబీ.. టీ20 సారథిగా షాహిన్‌ ఆఫ్రిదిని నియమించింది. అయితే, షాహిన్‌ కెప్టెన్‌గా ఆకట్టుకోకపోవడంతో టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందే బాబర్‌ ఆజంకు తిరిగి వన్డే, టీ20 నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈసారి కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది. గత టీ20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌ వరకు చేర్చిన బాబర్‌ ఆజం.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం గ్రూప్‌ దశ దాటకుండానే పాకిస్తాన్‌ ఇంటి బాట పట్టింది. ఈ నేపథ్యంలో బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ పాక్‌ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..