
T20 World Cup 2026 PAK vs USA: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఈరోజు, ఫిబ్రవరి 10న తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ శ్రీలంకలో జరుగుతుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ జట్టుకు ఇజ్జత్ కే సవాల్ గా మారింది. ఎందుకంటే, 2024 టీ20 ప్రపంచ కప్‌లో, సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన అమెరికా.. పాక్ జట్టుకు తీవ్ర నిరాశకు గురి చేసింది. అందువల్ల, పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకోవడం లేదు. ఈ మ్యాచ్‌కు ముందు, పాకిస్తాన్‌కు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ముగ్గురు అమెరికా ఆటగాళ్లు పాక్ జట్టు పాలిట విలన్ లా మారే ఛాన్స్ ఉంది. వాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..
మొహమ్మద్ మొహసిన్ పాకిస్తాన్‌లోని మింగోరాలో జన్మించాడు. ఇప్పుడు అమెరికా తరపున బరిలో నిలిచాడు. అతను లెగ్-స్పిన్ బౌలర్. శ్రీలంక స్పిన్ అనుకూల పిచ్‌లపై చాలా డేంజరస్ గా మారిపోతాడు. టోర్నమెంట్‌లో తన మొదటి మ్యాచ్‌లో భారత జట్టుకు చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఇప్పటికే స్పిన్‌తో పోరాడడంలో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మొహసిన్ పాత్ర ఈ మ్యాచ్ లో ఎంతో కీలకం కావొచ్చు.
ముంబైలో జన్మించిన సౌరభ్ నేత్రావల్కర్ అమెరికా జట్టు తరపున అత్యంత నమ్మకమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా మారిపోయాడు. ఇటీవలి మ్యాచ్‌లలో అతను కొంచెం ఖరీదైనవాడుగా మారాడు. కానీ, కీలక సమయంలో మాత్రం రెచ్చిపోతూ, ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితో అతని స్వింగ్, డెత్ ఓవర్లలో ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ పాకిస్తాన్ బ్యాటర్లకు సమస్యగా మారవచ్చు.
అమెరికా కెప్టెన్ మోనాక్ పటేల్ గతంలో పాకిస్తాన్ పాలిట విలన్ గా మారిన సంగతి తెలిసిందే. భారతదేశంలో జన్మించిన మోనాక్.. హాఫ్ సెంచరీతో చెలరేగి 2024 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో మరోసారి పాక్ జట్టుకు చుక్కలు చూపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..