Video: లక్కంటే నీదే భయ్యా.. బంతి తాకినా పడని బెయిల్స్.. కట్‌చేస్తే.. వరుసగా 4వ సెంచరీతో పాక్‌పై ఊచకోత

|

Oct 09, 2024 | 6:49 PM

Harry Brook 4th Test Century in Pakistan: పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ముల్తాన్ టెస్టు మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి, రెండో రోజు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ సెంచరీల మోత మోగించడంతో ఇంగ్లండ్‌ కూడా అదే రీతిలో స్పందించింది. మూడో రోజు మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సెంచరీ సాధించగా, ఆ జట్టు యంగ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాకిస్థాన్‌పై వరుసగా నాలుగో టెస్టు సెంచరీ చేయడం ద్వారా బ్రూక్ ప్రత్యేక రికార్డును సమం చేశాడు.

Video: లక్కంటే నీదే భయ్యా.. బంతి తాకినా పడని బెయిల్స్.. కట్‌చేస్తే.. వరుసగా 4వ సెంచరీతో పాక్‌పై ఊచకోత
Pak Vs Eng Brook Video
Follow us on

Harry Brook 4th Test Century in Pakistan: పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ముల్తాన్ టెస్టు మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి, రెండో రోజు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ సెంచరీల మోత మోగించడంతో ఇంగ్లండ్‌ కూడా అదే రీతిలో స్పందించింది. మూడో రోజు మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సెంచరీ సాధించగా, ఆ జట్టు యంగ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాకిస్థాన్‌పై వరుసగా నాలుగో టెస్టు సెంచరీ చేయడం ద్వారా బ్రూక్ ప్రత్యేక రికార్డును సమం చేశాడు. అయితే, సెంచరీకి కొద్ది దూరంలో ఉన్నప్పుడు హ్యారీ బ్రూక్ విషయంలో విచిత్రం చోటు చేసుకుంది. హ్యారీ బ్రూక్ సెంచరీకి చేరుకోకముందే తృటిలో ఔట్ అయ్యేవాడు. బ్రూక్ అమీర్ జమాల్ బంతిని డిఫెండ్ చేశాడు. కానీ, బంతిని ఆడడంలో లెక్క తప్పాడు. బంతి అతని హెల్మెట్ గ్రిల్‌కు తగిలింది. బ్రూక్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాడు. బ్రూక్ బంతిని ఆపే క్రమంలో స్టంప్‌లను తాకింది. అయితే బంతి తగిలినప్పటికీ, స్టంప్‌పై ఉంచిన బెయిల్స్ పడకపోవడంతో అతనికి లైఫ్ దక్కింది. ఆ సమయంలో బ్రూక్ 75 పరుగులతో ఉన్నాడు.

పాకిస్థాన్‌లో వరుసగా నాలుగో సెంచరీ..

మ్యాచ్ మూడో రోజు మూడో సెషన్‌లో ఇంగ్లండ్ యువ బ్యాట్స్ మెన్ బ్రూక్ తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్ పతనం తర్వాత కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. కేవలం 49 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మూడో సెషన్‌లోనూ 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. విశేషమేమిటంటే పాకిస్థాన్‌పై అతనికి ఇది వరుసగా నాలుగో టెస్టు సెంచరీ. అంతకుముందు, 2022 పాకిస్తాన్ పర్యటనలో, అతను మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించాడు. అందులోనూ ముల్తాన్‌లో రెండో సెంచరీ రాగా, ఇప్పుడు మరోసారి ఈ మైదానంలో సెంచరీ సాధించాడు.

లైఫ్ అందుకున్న హ్యారీ బ్రూక్..

ఈ సెంచరీతో, 25 ఏళ్ల బ్రూక్ అతని కంటే ముందు ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే చేయగలిగిన ఓ ఫీట్ చేసి చూపించాడు. కానీ, బ్రూక్ తక్కువ ఇన్నింగ్స్‌లో ఇలా చేయడం విశేషం. బ్రూక్ ఈ నాలుగు సెంచరీలు పాకిస్తాన్‌లో వచ్చాయి. ఈ విధంగా, అతను పాకిస్తాన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్‌లలో భారత మాజీ గ్రేట్ మొహిందర్ అమర్‌నాథ్, మాజీ శ్రీలంక స్టార్ అరవింద డి సిల్వాలను సమం చేశాడు. అమర్‌నాథ్ 18 ఇన్నింగ్స్‌ల్లో, డిసిల్వా 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించినప్పటికీ, బ్రూక్ ఈ 4 సెంచరీలను 6 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. పాకిస్థాన్‌లో వరుసగా 4 టెస్టుల్లో ఇది అతనికి నాలుగో సెంచరీ మాత్రమే కాదు, అతను తన వరుసగా మూడో ఇన్నింగ్స్‌ను కూడా సెంచరీగా మార్చాడు. అంతకుముందు ముల్తాన్‌లో 108 పరుగులు, కరాచీలో 111 పరుగులు వచ్చాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..