On This Day: ఒకే ఓవర్లో 35 పరుగులు.. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డ్.. బుమ్రా దెబ్బకు బలైన బ్రాడ్.. వీడియో..

Broad vs Bumrah: భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పై 35 పరుగులు బాదేశాడు.

On This Day: ఒకే ఓవర్లో 35 పరుగులు.. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డ్.. బుమ్రా దెబ్బకు బలైన బ్రాడ్.. వీడియో..
Bumrah Vs Broad

Updated on: Jul 02, 2023 | 12:09 PM

Jasprit Bumrah On This Day: టెస్టు క్రికెట్‌లో అత్యంత ఖరీదైన ఓవర్ బౌలింగ్ చేసిన రికార్డు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరిట నమోదైంది. బ్రాడ్ టెస్ట్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రాడ్‌పై ఇంతలా చెలిరేగిపోయింది ఎవరో కాదు.. మన భారత ప్లేయరే కావడం గమనార్హం. అలా అని, ఏ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అని అనుకున్నారో.. పప్పులో కాలేసినట్లే. ఈ 35 పరుగులను భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బాదేశాడు. అవును, ఏడాది క్రితం అంటే 2022లో ఇదే రోజున (జులై 2) బుమ్రా ఈ రికార్డును నెలకొల్పాడు.

2022లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడంతో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించాడు. ఆ టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగింది. రెండో రోజు మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది.

బ్రాడ్ వేసిన ఈ ఓవర్లో బుమ్రా రెండు సిక్సర్లు బాదాడు. ఇందులో నోబాల్‌పై సిక్సర్‌ బాదాడు. ఇది కాకుండా బుమ్రా 4 ఫోర్లు కొట్టాడు. అలాగే ఓ సింగిల్ రన్ తీశాడు. ఒక బంతి వైడ్‌గా వెళ్లి, బౌండరీకి చేరింది. తద్వారా టెస్టు క్రికెట్‌లో అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది. బుమ్రా కంటే ముందు, టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ వెటరన్ బ్రియాన్ లారా పేరిట నమోదైంది. లారా ఒక్క ఓవర్‌లో 28 పరుగులు చేశాడు.

మ్యాచ్‌లో ఓడిన టీమిండియా..

ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 245 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

దీంతో ఇంగ్లిష్‌ జట్టు 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్‌లో బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ టైటిల్‌ను అందుకున్నాడు. సిరీస్‌లో 23 వికెట్లు పడగొట్టి 125 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..