Cricket Records: వన్డే క్రికెట్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఆటగాళ్లు వీరే.. జాబితో మన వాడు ఎవరో తెలుసా?

Cricket Records: వన్డే క్రికెట్‌లో కెరీర్ మొత్తంలో ఒక్కసారి కూడా డకౌట్ కాని బ్యాటర్లు చాలా అరుదు. ఈ ప్రత్యేక జాబితాలో కేప్లర్ వెసెల్స్, డెరిల్ మిచెల్‌తో పాటు భారత మాజీ ఆటగాడు యశ్‌పాల్ శర్మ కూడా ఉన్నారు. వీరు ఒత్తిడిని తట్టుకుని నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

Cricket Records: వన్డే క్రికెట్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఆటగాళ్లు వీరే.. జాబితో మన వాడు ఎవరో తెలుసా?
Cricket Records

Updated on: Aug 27, 2026 | 3:10 PM

Cricket Records: క్రికెట్‌లో సెంచరీలు, భారీ స్కోర్లే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. అయితే కెరీర్ మొత్తంలో ఒక్కసారి కూడా సున్నాకే అవుట్ కాకుండా ఆడటం ఎంతో అరుదైన ఘనత. ఒత్తిడిని జయించి వన్డేల్లో ఎన్నడూ డకౌట్ కాకుండా కెరీర్ సాగించిన ఆ అరుదైన బ్యాటర్లు కూడా ఉన్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో డకౌట్ కాకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కేప్లర్ వెసెల్స్ పేరిట ఉంది. తన వన్డే కెరీర్‌లో ఆయన ఏకంగా 105 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశారు. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఒక్కసారి కూడా ఆయన సున్నా పరుగుల వద్ద వికెట్ కోల్పోకపోవడం విశేషం. కేప్లర్ వెసెల్స్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 3,367 పరుగులు సాధించారు. ఆరంభం నుంచి నిలకడగా ఆడే ఆయన టెక్నిక్, ఒత్తిడిలోనూ వికెట్ కాపాడుకునే సామర్థ్యం ఈ ఘనత సాధించేలా చేశాయి.

టాప్ పొజిషన్లో డారిల్ మిచెల్

ప్రస్తుత తరం క్రికెటర్లలో న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఈ అరుదైన క్లబ్‌లో కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటివరకు 57 వన్డే ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి ఒకే ఒక్కసారి కూడా సున్నాకే పెవిలియన్ చేరలేదు. ఈ ఇన్నింగ్స్‌ల్లో ఆయన 2,811 పరుగులు సాధించారు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో పాటు అవసరమైనప్పుడు వేగంగా పరుగులు సాధించే నైపుణ్యం మిచెల్ సొంతం. ఈ నిలకడతనమే ఆయనను డకౌట్ కాకుండా ఇన్ని మ్యాచ్‌ల్లో కాపాడుతూ వస్తోంది.

భారత 1983 వరల్డ్ కప్ హీరో ఘనత

ఈ విశిష్టమైన జాబితాలో భారత్ నుంచి దివంగత మాజీ బ్యాటర్ యశ్‌పాల్ శర్మ స్థానం సంపాదించుకున్నారు. 1978 నుంచి 1985 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యశ్‌పాల్ శర్మ 40 వన్డే ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశారు. ఈ సమయంలో ఆయన 883 పరుగులు చేశారు, ఎప్పుడూ డకౌట్ కాకపోవడం విశేషం. భారత్ 1983లో ప్రపంచకప్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ అలీ ఆగా 45 ఇన్నింగ్స్‌ల్లో 1,566 పరుగులు చేసి ఇప్పటివరకు సున్నా పరుగులకు అవుట్ కాలేదు.

జాబితాలో సౌతాఫ్రికా ఆటగాళ్లు

సౌతాఫ్రికా మాజీ ఆటగాడు పీటర్ కిర్‌స్టెన్ 40 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 1,293 పరుగులు చేసి ఒక్కసారి కూడా డకౌట్ అవ్వకుండా కెరీర్ పూర్తి చేశారు. అదే దేశానికి చెందిన జాక్స్ రుడోల్ఫ్ 39 ఇన్నింగ్స్‌ల్లో 1,174 పరుగులు సాధించి ఎన్నడూ సున్నా చుట్టలేదు. ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ క్యాంఫర్ కూడా ఈ అరుదైన జాబితాలో స్థానం సంపాదించారు. వన్డేల్లో డకౌట్ కాకుండా ఆడటం కేవలం అదృష్టం మాత్రమే కాదు, బ్యాటర్ టెక్నిక్, ఏకాగ్రతకు నిదర్శనం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us