IND vs AUS: మ్యూట్ బటన్ ప్రెస్ చేసిన పాట్ కమిన్స్.. సైలెన్స్‌లో నరేంద్ర మోడీ స్టేడియం..

|

Nov 19, 2023 | 9:06 PM

అయితే, పాట్ కమిన్స్ తన కెప్టెన్సీతో టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయం టీమిండియా పాలిట ఓటమిని ఖాయం చేసింది. అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. లక్షా 30వేల మందిని నిశ్శబ్దంగాలో పడేయండమే మా టార్టెట్ అని, అలా చేస్తేనే మాకు సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

IND vs AUS: మ్యూట్ బటన్ ప్రెస్ చేసిన పాట్ కమిన్స్.. సైలెన్స్‌లో నరేంద్ర మోడీ స్టేడియం..
Ind Vs Aus Pat Cummins
Follow us on

2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 241 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి, విజయానికి మరో 23 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో ట్రావిస్ హెడ్ (127), మార్నస్ లాబుషాగ్నే (47) ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. ఈ ప్రపంచకప్‌లో హెడ్‌ రెండో సెంచరీ సాధించాడు. వీరిద్దరి కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియా ఓటమి ఖాయమైంది. భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఓదశలో అంటే, తొలి ఓవర్లో వికెట్లు పడగొట్టిన బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో స్టేడియంతోపాటు భారత్ మొత్తం నిశ్శబ్దంగా మారింది.

అయితే, పాట్ కమిన్స్ తన కెప్టెన్సీతో టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయం టీమిండియా పాలిట ఓటమిని ఖాయం చేసింది. అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. లక్షా 30వేల మందిని నిశ్శబ్దంగాలో పడేయండమే మా టార్టెట్ అని, అలా చేస్తేనే మాకు సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా ఛేజింగ్ మొదలైన కొద్దిసేపు మాత్రమే నరేంద్ర మోడీ స్టేడియం సందడిగా మారింది. ఆ తర్వాత హెడ్, లబూషేన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి సైలెంట్‌గా మారింది.

రోహిత్ టాస్ గెలిచినా.. భారత్ ఓడిపోయేదే..

అయితే, రోహిత్ శర్మ టాస్ ఓడి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, రోహిత్ శర్మ టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకునేవాడినంటూ చెప్పుకొచ్చాడు. ఇలా జరిగినా టీమిండియా ఓటమి పాలయ్యేదేనని ఫ్యాన్స్ అంటున్నారు.