Rishabh Pant : మైదానంలోనే కాదు.. సంపాదనలోనూ సెంచరీ కొట్టిన రిషబ్ పంత్

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ, అతని సంపాదన మాత్రం తగ్గలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పేరుగాంచిన పంత్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 28 ఏళ్ల ఈ ఆటగాడు సంపాదన విషయంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Rishabh Pant : మైదానంలోనే కాదు.. సంపాదనలోనూ సెంచరీ కొట్టిన రిషబ్ పంత్
Rishab Pant

Updated on: Oct 04, 2025 | 9:19 AM

Rishabh Pant : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. అయినా అతని ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటూ రాలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పేరుగాంచిన పంత్, ఐపీఎల్ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడి నిలిచాడు. అయితే, అతని ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా లేకపోయినప్పటికీ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌లో అతను తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. 28 ఏళ్ల ఈ యువ ఆటగాడు సంపాదన విషయంలో సెంచరీ పూర్తి చేసుకుని, ఏకంగా ఒక స్పోర్ట్స్ టీంను కూడా సొంతం చేసుకున్నాడు.

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ భారతదేశంలోనే అత్యంత ధనిక, ఎక్కువ పారితోషికం తీసుకునే క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. గోయా హిల్స్ నివేదికల ప్రకారం, 2025లో పంత్ మొత్తం నికర విలువ సుమారు 100 కోట్ల రూపాయలు (సుమారు 12 మిలియన్ అమెరికన్ డాలర్లు). అతని ఆదాయం ప్రధానంగా ఐపీఎల్ కాంట్రాక్టులు, బీసీసీఐ నుండి వచ్చే జీతం, కోట్లాది డాలర్ల ప్రకటనల ఒప్పందాల ద్వారా సమకూరుతుంది.

తన స్ట్రోక్స్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలకు పేరుగాంచిన పంత్, గాయం కారణంగా ఆట నుండి దూరంగా ఉన్నప్పటికీ, భారత క్రికెట్‌లో ఒక కీలక భాగంగానే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో అతను ఒక కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రిషబ్ పంత్‌ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినప్పుడు అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతను ఈ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. దీనితో పాటు, ఐపీఎల్ ఎంగేజ్‌మెంట్ బోనస్ సిస్టమ్ కింద అతను ప్రతి మ్యాచ్‌కు 7.5 లక్షల రూపాయలు సంపాదించాడు. దీనికి అదనంగా, బీసీసీఐ (BCCI) కూడా అతనికి కోట్లాది రూపాయలను జీతంగా చెల్లిస్తుంది.

పంత్ ఆదాయ వనరుల వివరాలు:

* ఐపీఎల్ జీతం: రూ.27 కోట్లు

బీసీసీఐ కాంట్రాక్ట్: రూ.5 కోట్లు

ప్రకటనలు : రూ.10-15 కోట్లు

స్థిరాస్తులు, పెట్టుబడులు: రూ.10 కోట్లు

మ్యాచ్ ఆడితే పంత్‌కు ఎంత వస్తుంది?

టెస్ట్ మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కు రూ.15 లక్షలు

వన్డే మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కు రూ.6 లక్షలు

టి20ఐ మ్యాచ్: ప్రతి మ్యాచ్‌కు రూ.3 లక్షలు

రిషబ్ పంత్‌కు ఢిల్లీలో ఒక ఇల్లు ఉంది, దాని విలువ సుమారు రూ.2 కోట్లు. దీనితో పాటు హరిద్వార్, డెహ్రాడూన్, రూర్కీలో కూడా అతనికి ఇళ్ళు ఉన్నాయి. అతని వద్ద అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో ఆడి ఎ8 (రూ.1.32 కోట్లు), ఫోర్డ్ మస్టాంగ్ (రూ. 2 కోట), మెర్సిడెస్-బెంజ్ జిఎల్‌ఈ (రూ.2 కోట్లు) వంటివి ఉన్నాయి.

ఇదే సంవత్సరం రిషబ్ పంత్ వరల్డ్ పికిల్ బాల్ లీగ్‎లో ఒక టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీతో కలిసి పంత్ ముంబై పికల్ పవర్ టీమ్ యాజమాన్యాన్ని పొంది, ఆ జట్టుకు సహ-యజమానిగా నిలిచాడు. పికిల్ బాల్ ఆట అనేది టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ రూల్స్ కలిపి ఒకే కోర్టులో ఆడే క్రీడ. ఈ విధంగా రిషబ్ పంత్ మైదానంలోనే కాదు.. ఆర్థిక రంగంలో కూడా తనదైన ముద్ర వేసి విజేతగా నిలుస్తున్నాడు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి