Nora Fatehi : ఫుట్‌బాల్ స్టార్‎తో నోరా ఫతేహి డేటింగ్ ?.. సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పిన డ్యాన్సింగ్ క్వీన్

Nora Fatehi : నోరా ఫతేహి, మొరాకో ఫుట్‌బాల్ స్టార్ యాసిన్ బోనో డేటింగ్ రూమర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. రేడియో షోలో బోనో గురించి అడగగానే నోరా సిగ్గుపడటం చర్చనీయాంశమైంది. అతను మంచి స్నేహితుడని చెప్పిన నోరా, ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్‌కీపర్ అంటూ ప్రశంసించింది. అయితే రిలేషన్‌షిప్‌ను మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు.

Nora Fatehi  : ఫుట్‌బాల్ స్టార్‎తో నోరా ఫతేహి డేటింగ్ ?.. సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పిన డ్యాన్సింగ్ క్వీన్
Nora Fatehi

Updated on: Aug 05, 2026 | 5:39 PM

Nora Fatehi : బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి గడిచిన కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితం, డేటింగ్ వార్తలతో మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆఫ్రికన్ దేశమైన మొరాకోకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ యాసిన్ బోనోతో నోరా ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వీరిద్దరిలో ఎవరూ ఈ రూమర్లపై స్పందించనప్పటికీ, తాజాగా ఒక రేడియో టాక్ షోలో నోరా చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత తోడయ్యాయి. ది క్రిస్ ఫేడ్ షోలో పాల్గొన్న నోరాకు ఆమె డేటింగ్ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

బోనో గురించి అడగ్గానే నోరా సిగ్గుల మొగ్గ

సదరు షోలో యాసిన్ బోనోతో డేటింగ్ చేస్తున్నారనే వార్తల గురించి హోస్ట్ ప్రశ్నించగా, నోరా నవ్వుతూ “అవును, అతను నాకు మంచి స్నేహితుడు” అని సమాధానమిచ్చింది. బోనోను ప్రశంసిస్తూ అతను ఒక అద్భుతమైన వ్యక్తి, ఈ ప్రపంచంలోనే బెస్ట్ గోల్ కీపర్ అంటూ కొనియాడింది. వారు చాలా మంచి స్నేహితులమని చెప్పినప్పటికీ షో హోస్టులు బోనో గురించి మాట్లాడుతుంటే నోరా ముఖంలో సిగ్గు స్పష్టంగా కనిపించింది. మీరిద్దరూ చాలా ముచ్చటైన జంటగా ఉంటారు అని కో-హోస్ట్ అనగానే నోరా మరింతగా సిగ్గుపడటం వల్ల ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బోనో తనకు చాలా కాలంగా తెలుసని, అయితే కొన్ని నెలల క్రితమే మళ్లీ మాటలు మొదలయ్యాయని నోరా వెల్లడించింది.

కసాబ్లాంకాలో ప్రత్యక్షం

నోరా, బోనోల మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఈనాటివి కావు, నెలలుగా నడుస్తున్నాయి. మొరాకోలోని కసాబ్లాంకా ప్రాంతంలో గల ఆన్ దియాబ్ పరిసరాల్లో వీరిద్దరూ కలిసి తిరుగుతూ కనిపించారనే వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. ఎన్ని వార్తలు వస్తున్నప్పటికీ, నోరా ఫతేహి కానీ, యాసిన్ బోనో కానీ తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు.

ఎవరీ యాసిన్ బోనో?

యాసిన్ బోనో మొరాకో దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులలో ఒకడు. సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్ హిలాల్‎తో పాటు మొరాకో జాతీయ జట్టుకు అతను గోల్‌కీపర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పెనాల్టీలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫిఫా ప్రపంచ కప్‌లో మొరాకో జట్టు సృష్టించిన చారిత్రాత్మక విజయాల్లో బోనో కీలక పాత్ర పోషించాడు.

బోనో వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు

ఇటీవలి కాలంలో మొరాకో మీడియాలో బోనో వ్యక్తిగత జీవితంపై అనేక కథనాలు వచ్చాయి. 2016లో ఇమాన్ ఖల్లాద్ అనే మహిళను వివాహం చేసుకున్న బోనోకు 2020లో ఇస్సాక్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యతో విభేదాల కారణంగా విడిపోయాడని, తిరిగి కలిసిపోయాడనే రకరకాల వార్తలు వినిపించినప్పటికీ, బోనో లేదా అతని కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా ఎప్పుడూ నోరు విప్పలేదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us