Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్!

Team India Coach : భవిష్యత్తులో టీమిండియాకు టి20 ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా ఒక కోచ్‌ను నియమించాలనుకుంటే, దానికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రమే సరైన వ్యక్తి అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ప్రతిపాదన చేశారు.

Team India Coach : గౌతమ్ గంభీర్ తర్వాత టీమిండియా టీ20 కోచ్ ఆయనేనా? మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్!
Ashish Nehra

Updated on: Jun 03, 2026 | 6:36 PM

Team India Coach : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. అయితే భవిష్యత్తులో టీమిండియాకు టి20 ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా ఒక కోచ్‌ను నియమించాలనుకుంటే, దానికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రమే సరైన వ్యక్తి అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ప్రతిపాదన చేశారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఆయన నడిపిస్తున్న తీరు, ఆటగాళ్లను హ్యాండిల్ చేసే పద్ధతి మంజ్రేకర్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గంభీర్ తర్వాత భారత టి20 జట్టు బాధ్యతలను నెహ్రాకు అప్పగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ అరాచకం

ఆశిష్ నెహ్రా కోచింగ్ సామర్థ్యానికి ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ సాధించిన రికార్డులే నిదర్శనం. 2022 లో కొత్త ఫ్రాంచైజీగా అడుగుపెట్టిన గుజరాత్, తన తొలి సీజన్ లోనే ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 2023లో కూడా వరుసగా రెండోసారి ఫైనల్ చేరి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో సైతం నెహ్రా మార్గదర్శకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ మెట్లు ఎక్కింది. కానీ వరుసగా రెండో ఏడాది కప్పు కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో తృటిలో టైటిల్ మిస్ చేసుకుంది. 2024 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వదిలి ముంబై ఇండియన్స్‌కు వెళ్లినప్పటికీ, గుజరాత్ జట్టు ఇప్పటికీ మార్కెట్లో అత్యంత బలమైన శక్తిగా కొనసాగుతుండటం వెనుక నెహ్రా శ్రమ ఎంతో ఉంది.

స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్ అంటూ మంజ్రేకర్ ప్రశంసలు

స్పోర్ట్‌స్టార్ టాక్ షోలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. “ఆశిష్ నెహ్రా పక్కా ప్రాక్టికల్‌గా ఆలోచించే స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్. ఆయనతో క్రికెట్ గురించి మాట్లాడితే ఎక్కడా ఎమోషనల్ అవ్వడు. జట్టులో ఉన్న లోపాలు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దాలి అనే విషయాలపైనే క్లినికల్‌గా ఫోకస్ పెడతాడు. కేవలం క్రికెట్ గురించే ఆలోచిస్తూ, ఎవరినో సంతోష పెట్టడానికో లేదా జట్టులో తన సీటు కాపాడుకోవడానికో రాజకీయం చేసే వ్యక్తి అస్సలు కాదు. ఆటగాళ్లకు కూడా కోచ్‌లోని ఈ నిజాయితీ బాగా నచ్చుతుంది” అని మంజ్రేకర్ చెప్పుకొచ్చారు. కోచ్‌గా సక్సెస్ వచ్చినా నెహ్రా ఎప్పుడూ క్రెడిట్ కోసం ప్రాకులాడడని, చాలా సింపుల్‌గా తన పని తాను చేసుకుపోతాడని కొనియాడారు.

సపోర్టింగ్ రోల్ వద్దు.. వస్తే హెడ్ కోచ్‌గానే రావాలి

సాధారణంగా మాజీ ఫాస్ట్ బౌలర్లను టీమ్ ఇండియాకు బౌలింగ్ కోచ్‌లుగా నియమించడం మనం చూస్తుంటాం. కానీ ఆశిష్ నెహ్రా విషయంలో మాత్రం అలా చేయకూడదని మంజ్రేకర్ స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో వేర్వేరు కెప్టెన్ల కింద జట్టును సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన అద్భుతమైన ట్రాక్ రికార్డు నెహ్రాకు ఉంది కాబట్టి, ఆయనను కేవలం బౌలింగ్ కోచ్‌గా పిలిస్తే అది కరెక్ట్ కాదని అన్నారు. ఒకవేళ భవిష్యత్తులో బీసీసీఐ స్ప్లిట్ కోచింగ్ (ఫార్మాట్‌కు ఒక కోచ్) విధానాన్ని తీసుకువచ్చి, టీ20 స్పెషలిస్ట్ కోచ్‌ను పెట్టాలనుకుంటే నెహ్రాను నేరుగా ప్రధాన కోచ్ పదవికే పరిశీలించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.

గంభీర్ విజయాల పరంపర

ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టు వైట్ బాల్ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పటికే భారత్ ఖాతాలో చాంపియన్స్ ట్రోఫీ, టి20 వరల్డ్ కప్ టైటిళ్లు ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో కూడా మెన్ ఇన్ బ్లూ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అయితే భవిష్యత్తులో గంభీర్ పై పనిభారాన్ని తగ్గించడానికి లేదా సుదీర్ఘ ప్రణాళికల కోసం టి20 ఫార్మాట్‌కు నెహ్రా వంటి ఫలితాలను ఇచ్చే కోచ్ అందుబాటులోకి వస్తే టీమిండియాకు తిరుగుండదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us