
Team India New Zealand Tour: భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు సాగే ఈ టూర్‌లో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లతో పాటు పలువురు యువ క్రికెటర్లకు కూడా చోటు కల్పించారు.
రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి దిగ్గజాలకు ఈ న్యూజిలాండ్ పర్యటన చివరిది కావచ్చనే చర్చ ఇప్పటికే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత వీరిద్దరూ వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే వీరితో పాటు మరో నలుగురు భారత ఆటగాళ్లకు కూడా ఇదే చివరి న్యూజిలాండ్ టూర్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
1. జస్ప్రీత్ బుమ్రా: ఈ జాబితాలో తొలి పేరు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). ప్రస్తుతం అతడి వయసు 32 ఏళ్లు. గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలు కూడా బుమ్రాను ఇబ్బంది పెడుతున్నాయి. టెస్టులు, వన్డేల్లో అతడు గతంతో పోలిస్తే పరిమితంగానే ఆడుతున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ఇంకా ఎంతకాలం కొనసాగుతాడనేది కూడా స్పష్టంగా చెప్పలేం. ఈసారి న్యూజిలాండ్ పర్యటనలో బుమ్రా టెస్టు జట్టులో మాత్రమే ఉన్నాడు. వయసు, ఫిట్‌నెస్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. భవిష్యత్తులో న్యూజిలాండ్ టూర్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఎక్కువమంది చదివినది: జస్ట్ 6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. యూవీ 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్..
2. కేఎల్ రాహుల్: అనుభవజ్ఞుడైన బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడి ఫిట్‌నెస్ కూడా పెద్ద సమస్యగా కనిపించడం లేదు. అయితే రాహుల్ వయసు ఇప్పటికే 34 ఏళ్లకు చేరింది. భారత జట్టు తరచుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లదు. సాధారణంగా తదుపరి టూర్‌కు కొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలా చూస్తే తదుపరి పర్యటన సమయానికి రాహుల్ 37 ఏళ్లకు పైబడే అవకాశం ఉంది. అప్పటికి జట్టులో అతడి స్థానం ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం. అందుకే ఈ పర్యటన రాహుల్‌కు న్యూజిలాండ్‌లో చివరి పర్యటన కావచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
3. సంజూ శాంసన్: వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) కూడా ఈ జాబితాలో ఉన్నాడు. సంజూ ప్రస్తుతం 31 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ.. టీమిండియాలో తన స్థానాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడంలో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కూడా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటింగ్ కాంబినేషన్‌లో పోటీ మరింత పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో సంజూ నిలకడగా రాణిస్తేనే మరోసారి న్యూజిలాండ్ పర్యటనకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రస్తుత టూర్‌నే అతడి చివరి న్యూజిలాండ్ సిరీస్‌గా భావించాల్సి రావచ్చు.
4. భువనేశ్వర్ కుమార్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) అనూహ్యంగా టీమిండియా టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అతడి కెరీర్‌కు కీలకంగా మారనుంది.
ఎక్కువమంది చదివినది: తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు.. ప్రపంచ రికార్డ్ నే షేక్ చేసిన టీమిండియా నయా సెన్సేషన్..!
భువనేశ్వర్ ప్రస్తుతం 36 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శనపై సెలెక్టర్లు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే భవిష్యత్ సిరీస్‌లకు అతడిని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో మరోసారి న్యూజిలాండ్ టూర్‌కు భువీ రావడం కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..