India Vs New Zealand: ముంబై టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను 372 పరుగుల తేడాతో ఓడించింది సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ ఓటమితో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌తో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లోనూ పడిపోయింది. న్యూజిలాండ్ ఓటమికి ప్రధాన కారణం పేలవమైన ఆట, అలాగే న్యూజిలాండ్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా లేకపోవడం. గాయం కారణంగా కేన్ విలియమ్సన్ ముంబై టెస్టు ఆడలేకపోయాడు. కేన్ విలియమ్సన్‌కు మోచేతి గాయం మరోసారి ఎటాక్ కావడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతి ఇచ్చింది. ఫలితంగా ముంబైలో న్యూజిలాండ్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. కేన్ విలియమ్సన్ మోచేతి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. దీనిపై న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ ఆందోళన వ్యక్తం చేశాడు. కివీస్ కెప్టెన్ కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుందని మైక్ హెస్సన్ అభిప్రాయపడ్డాడు.
శస్త్రచికిత్స చేయాల్సిందే!
విలియమ్సన్ మోచేతి నొప్పి నుంచి బయటపడాలంటే, శస్త్రచికిత్సతోనే వీలవుతుందని కివీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్‌తో జరిగిన సంభాషణలో మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. హెస్సన్ మాట్లాడుతూ, ‘విలియమ్సన్‌కు శస్త్రచికిత్స మాత్రమే చివరి ఎంపిక అని నాకు అనిపిస్తోంది. విలియమ్సన్ చాలా కలత చెందాడని నాకు తెలుసు. ఎందుకంటే అతనికి చాలా విశ్రాంతి ఇచ్చారు. అతని మోచేయి ఇంకా నయం కాలేదు. గత 18 నెలల్లో విలియమ్సన్ చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడని తెలిపాడు.
హెస్సన్ మాట్లాడుతూ, ‘విలియమ్సన్‌కు ఇటీవల తుంటి గాయం అయింది. అయితే అతని మోచేయి గాయం చాలా కాలంగా వేధిస్తోనే ఉంది. అతను ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండటం వల్ల గాయం నుంచి పూర్తిగా బయటపడొచ్చని’ పేర్కొన్నాడు.
వచ్చే ఏడాది న్యూజిలాండ్‌కు చాలా ముఖ్యం..
న్యూజిలాండ్ ప్రస్తుతం జనవరి నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడవలసి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. దీనిలో కేన్ విలియమ్సన్ విశ్రాంతి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే దీని తర్వాత ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ను కూడా ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి-మార్చిలో, దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇందులో 2 టెస్టులు ఆడతాయి. ఆ తర్వాత మార్చిలో న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు 3 వన్డేల సిరీస్ ఆడనుంది.
Ashes Series: యాషెస్ తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం..!