Video: వామ్మో.. జస్ట్ మిస్.. అంతే.. బ్యాటర్‌కు చేతులు జోడించి నమస్కరించిన బౌలర్.. ఎందుకో తెలుసా?

|

Oct 09, 2023 | 8:55 PM

New Zealand vs Netherlands: న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో మీక్రాన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. అయితే, బంతి నేరుగా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లోని స్టంప్‌లోకి వెళ్లింది. ఈ షాట్ చాలా వేగంగా అంటే కళ్లు మూసి తెరిచే లోపు జరిగిపోయింది. స్టంప్‌లు నేలకూలాయి. ఈ క్రమంలో మీక్రాన్ తన చేతులను జోడించి, వంగి మరీ దండం పెట్టాడు. దీంతో మీక్రాన్ చేసిన పని నిజంగా అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Video: వామ్మో.. జస్ట్ మిస్.. అంతే.. బ్యాటర్‌కు చేతులు జోడించి నమస్కరించిన బౌలర్.. ఎందుకో తెలుసా?
Daryl Mitchell Van Meekeren
Follow us on

World Cup 2023, New Zealand vs Netherlands: క్రికెట్ ఫీల్డ్‌లో బౌలర్, బ్యాట్స్‌మెన్ మధ్య వాగ్వాదాలు తరుచుగా చూస్తుంటాం. కానీ, ప్రపంచ కప్ 2023లో మాత్రం కాస్త భిన్నంగా కనిపించింది. నెదర్లాండ్స్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక బౌలర్ బ్యాట్స్‌మన్‌కి చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కివీస్ ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ ఆడిన షాట్ ఆడిన వీడియో చూస్తూ మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో మీక్రాన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. అయితే, బంతి నేరుగా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లోని స్టంప్‌లోకి వెళ్లింది. ఈ షాట్ చాలా వేగంగా అంటే కళ్లు మూసి తెరిచే లోపు జరిగిపోయింది. స్టంప్‌లు నేలకూలాయి. ఈ క్రమంలో మీక్రాన్ తన చేతులను జోడించి, వంగి మరీ దండం పెట్టాడు. దీంతో మీక్రాన్ చేసిన పని నిజంగా అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన వైపు షాట్ ఆడనందుకు బ్యాట్స్‌మన్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది చూసిన మిచెల్ కూడా షాక్ అయ్యాడు.

న్యూజిలాండ్ భారీ స్కోర్..

హైదరాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 322 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరపున విల్ యంగ్ 70 పరుగులు చేశాడు. లాథమ్ 53 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. డారెల్ మిచెల్ కూడా 48 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో మిచెల్ సాంట్నర్ 17 బంతుల్లో 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మీక్రాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్ కూడా తలా 2 వికెట్లు సాధించారు.

ఇరుజట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..