IND vs AUS Test: ‘ఆస్ట్రేలియాను టీమిండియా వైట్‌వాష్‌ చేస్తుంది’.. టెస్ట్ సిరీస్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

|

Feb 16, 2023 | 5:28 PM

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఈ సిరీస్‌పై సంచల వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌‌లో ఆసీస్..

IND vs AUS Test: ‘ఆస్ట్రేలియాను టీమిండియా వైట్‌వాష్‌ చేస్తుంది’.. టెస్ట్ సిరీస్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
Simon Doull On Ind Vs Aus Test Series
Follow us on

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. రేపు ఢిల్లీ వేదికగా జరగబోయే రెండో మ్యాచ్‌లో కూడా గెలవాలని భావిస్తోంది. ఇదే తరహాలో రెండో మ్యాచ్‌లో గెలిచి టెస్ట్ సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా జట్టు కూడా పట్టుదలగా ఉంది. అయితే ఈ తరుణంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఈ సిరీస్‌పై సంచల వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌‌లో ఆసీస్ ఒక్క మ్యాచ్ గెలిచినా ఆశ్చర్యమేనన్నాడు. ఇంకా ఈ సిరీస్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించకపోతే.. 4-0 తేడాతో ఆస్ట్రేలియా జట్టును భారత్ ఓడిస్తుందని కూడా జోస్యం చెప్పాడు ఈ కివీస్ మాజీ ప్లేయర్.

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గినా.. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వర్షం అంతరాయం కలిగించకపోతే భారత్‌ 4-0  తేడాతో సిరీస్‌ను దక్కించుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా బౌలర్లు బంతితో రాణిస్తే లేదా స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ పోరాడితే ఒక టెస్ట్‌లో ఆ జట్టు విజయం సాధిస్తుంది. నాకైతే ఈ సిరీస్‌ని భారత్‌ 3-1 లేదా 4-0 తేడాతో కైవసం చేసుకుంటుందని అనిపిస్తోంది’ అని వివరించాడు.

కాగా, నాగ్‌పుర్‌ టెస్టులో పిచ్‌ని భారత్‌ తమ బౌలర్లకు అనుకూలంగా తయారు చేసుకుందని ఆస్ట్రేలియా మీడియాతో కొంతమంది ఆసీస్ ఆటగాళ్లు ఆరోపణలు చేశారు. దీని గురించి డౌల్‌ మాట్లాడుతూ.. ఆతిథ్య దేశం తమకు అనుకూలంగా పిచ్‌లు సిద్ధం చేసుకోవడం కొత్త విషయం కాదని వివరించాడు. మరోవైపు ఫిబ్రవరి 9న ప్రారంభమైన నాగ్‌పుర్‌ తొలి టెస్టును భారత్ ఇన్నింగ్ప్‌ 132 పరుగుల తేడాతో మూడు రోజులలోనే గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రేపటి( ఫిబ్రవరి 17 )నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..