IPL 2024: ఏ బ్యాడ్ టైంలో కోహ్లీ టీంలో చేరావ్ బ్రో.. 3 ఏళ్లుగా అరంగేట్రం చేయలే.. ఇప్పుడేమో జట్టు నుంచే ఔట్..

|

Dec 30, 2023 | 4:52 PM

IPL 2024, Royal Challengers Bangalore: ఈ IPL వేలం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మొత్తం ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీనికి ముందు, మొత్తం 19 మంది ఆటగాళ్లను రిటైన్ చేసింది. దీని ప్రకారం, ఇప్పుడు RCB ఫ్రాంచైజీ 25 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఏర్పాటు చేసుకుంది.

IPL 2024: ఏ బ్యాడ్ టైంలో కోహ్లీ టీంలో చేరావ్ బ్రో.. 3 ఏళ్లుగా అరంగేట్రం చేయలే.. ఇప్పుడేమో జట్టు నుంచే ఔట్..
Ipl 2024 Finn Allen
Follow us on

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 యాక్షన్‌లో మొత్తం 72 మంది ఆటగాళ్లు వేలంలో లక్కీ ఛాన్స్ కొట్టేశారు. అయితే, అమ్ముడుపోని ఆటగాళ్ల సంఖ్య 261. ఈ విధంగా, విక్రయించని ఆటగాళ్ల జాబితాలో ఫిన్ అలెన్ ఒకడిగా మిగిలాడు. ఈ వేలంలో న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్ రూ.75 లక్షలు మాత్రమే పలికాడు. అసలు ధరతోనే వేలంలో నిలిచాడు. అయితే, ఈ ప్లేయర్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. యువ ఆటగాడిని బేస్ ధరకు కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ కూడా వెనుకాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎందుకంటే ఫిన్ అలెన్ గత మూడు సీజన్లలో RCB జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ మూడేళ్లలో RCB మొత్తం 45 మ్యాచ్‌లు ఆడింది. ఈ సమయంలో, అలెన్‌కి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే మూడేళ్లుగా ఆర్‌సీబీ కోసం ఫిన్ అలెన్ బెంచ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ప్రతి సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడాలనే ఆశతో జట్టులో కనిపించిన ఫిన్ అలెన్‌ను ఈ వేలానికి ముందు వదులుకున్నారు. మూడేళ్లుగా ఐపీఎల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.. అలెన్‌ ఖాతాలో ఒక్క పరుగు కూడా పడలేదు.

అందుకే వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ ఫిన్ అలెన్ ఈసారి వేలంలో ఏ జట్టు తీసుకోలేదు. ఎందుకంటే న్యూజిలాండ్‌కు యువ స్ట్రైకర్ తుఫాన్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఐపీఎల్‌లో అతని సత్తా చాటేందుకు ఆర్‌సీబీ అవకాశం ఇవ్వలేదు.

దీంతో మూడేళ్ల పాటు ఆర్‌సీబీని నమ్ముకున్న ఫిన్ అలెన్.. ఇప్పుడు సీజన్-17కి దూరమయ్యాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేయకపోవడం కూడా విశేషం.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మోహమ్ దీప్ , మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..