Mohammed Shami Wife Hasin Jahan: భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తుంది. తాజాగా ఓ హాట్‌ఫొటో ఇన్‌స్టాలో షేర్ చేసి రచ్చ చేస్తుంది. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. హసీన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆ ఫొటో చూసిన కొంతమంది అందంగా ఉన్నావని పొగుడుతుంటే.. మరికొందరు చాలా దారణంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హసీన్ తెలుపు రంగు రగ్గడ్ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి కాస్త బోల్డ్‌గా దర్శనిమిచ్చింది. ఇది కాస్త కొంచెం అగ్లీగా కనిపించడంతో నెటిజన్లు మండిపడతున్నారు. ఇక షమీ-హసీన్ చాలా కాలం నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు భద్రత కల్పించాలని కోల్‌కతా హైకోర్టుకు అప్పీలు చేసి అందరి దృష్టిలో పడింది హసీన్ . అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినందుకు కొంతమంది ఆమెను సోషల్ మీడియాలో తిట్టిపోశారు. అత్యాచారం చేస్తామని, చంపేస్తామని నీచమైన పోస్టులు పెట్టారు వీటిని తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించారు.
ఇక షమీ-హసీన్ చాలా కాలం నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా జీవిస్తున్నప్పటికి.. ఇంకా వీరు విడాకులు తీసుకోలేదు. గతంలో తన భర్తకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భార్యను వేధించాడన్న ఆరోపణల కేసులో అతనిపై అభియోగాలు నమోదు చేశారు. తర్వాత అతనికి క్లీన్ చీట్ రావడంతో బీసీసీఐ షమీకి కాంట్రాక్ట్ కొనసాగించింది.