
భారత మాజీ హెడ్ కోచ్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మ్యాచ్‌ల సమయంలో డగౌట్‌లో నోట్బుక్‌లో ఏమొనో రాస్తుంటారు. ఇది చాలాకాలంగా అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న విషయమే. చివరకు, ద్రావిడ్ స్వయంగా తన నోట్బుక్ రాసే విషయాన్ని తాజాగా వెల్లడించారు. నిజానికి అది చాలా సాదా విషయమే! స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రావిడ్ మాట్లాడుతూ, తనకు ప్రత్యేకమైన స్కోరింగ్ పద్ధతి ఉందని చెప్పారు. అది టీ20 అయినా, వన్డే అయినా వర్తిస్తుంది. ఇది ఏ రహస్య వ్యూహం కాదు, కేవలం ఆయనకు సరిపోయే విధంగా మ్యాచ్‌ను రికార్డ్ చేసుకునే స్టైల్ మాత్రమే.
ద్రావిడ్ ఇలా రాసుకోవడం వల్ల తరువాత మ్యాచ్‌ను రివ్యూ చేయడం సులభమవుతుందని చెప్పారు. ఒకే ఒక్క స్కోర్‌కార్డ్ చూడటం కంటే, తన పద్ధతిలో చూసుకుంటే మ్యాచ్ పరిస్థితులు, ఓ ఓవర్‌లో ఏమైంది, మ్యాచ్‌లో ఎప్పుడు మలుపు వచ్చింది అన్న విషయాలు స్పష్టంగా గుర్తుకు వస్తాయని చెప్పారు.
అయితే, ఆ నోట్బుక్‌లో గొప్ప వ్యూహాలు, గేమ్ ప్లాన్‌లు, సంఘటనల వివరణలు ఏమాత్రం ఉండవని ఆయన స్పష్టం చేశారు. “అది అసలు పెద్ద విషయం కాదు. బోరింగ్‌గానో, చీప్‌గానో అనిపించవచ్చు. కేవలం ఒక సాధారణ స్కోరింగ్ పద్ధతే,” అని చెప్పారు.
ఈ విధంగా రాసుకోవడం వల్ల మ్యాచ్ సమయంలో తాను పూర్తిగా ఫోకస్‌తో ఉంటానని, తర్వాత తిరిగి చూసేటప్పుడు బయట స్కోర్‌కార్డ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉంటుందని చెప్పారు. “నేను ఏవైనా గొప్ప రహస్యాలు రాస్తున్నట్టేమీ కాదు. అది కేవలం ఒక పద్దతిగానే ఉంది, అది నాకు ఉపయోగపడుతుంది. ఆ దశలో ఏం జరిగింది, ఏ ఓవర్‌లో ఏమైంది అనేది రివ్యూకు సులభంగా ఉంటుంది” అని ద్రావిడ్ చెప్పిన మాటలు. తద్వారా, రాహుల్ ద్రావిడ్ తన నోట్బుక్‌లో రాస్తున్నది గొప్ప రహస్యమేమీ కాదు.. తనదైన శైలి, మ్యాచ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికే అది ఓ సాధనమైతే చాలు!
రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆయన ఈ బాధ్యతను స్వీకరించారు. ఇంతకు ముందు, ఆయన భారత జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్నారు. టెస్టుల్లో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో భారత జట్టును కొన్ని కీలక విజయాల వైపు దారి చూపించిన తర్వాత, ఐపీఎల్‌కు మళ్లారు.
రాజస్థాన్ రాయల్స్‌లో కోచ్‌గా ఆయన ప్రాముఖ్యత ఏమిటంటే.. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ఆయనకు ఉన్న ప్రత్యేక నైపుణ్యం. గేమ్‌ను శాస్త్రీయంగా విశ్లేషించే తత్వం ఉండటం. సాధారణంగా కనిపించే పనుల్లో ప్రాముఖ్యత చూపించడం. ఉదాహరణకు, మ్యాచ్ సమయంలో స్కోరింగ్ చేయడం ద్వారా విశ్లేషణకు సిద్ధమవ్వడం. ద్రావిడ్ లాంటి బోధనా శైలిలో ఉన్న కోచ్‌తో, రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాళ్లు మరింత మెరుగ్గా ప్రదర్శించడానికి అవకాశం ఉంది.
The secret is out now! 📝😁#RahulDravid reveals what he keeps writing in the @rajasthanroyals dugout. Dravid being Dravid! 🩷
Watch #IPLonJioStar 👉 #CSKvRR | TUE, MAY 20, 6:30 PM on Star Sports Network & JioHotstar! pic.twitter.com/40qPKvISHC
— Star Sports (@StarSportsIndia) May 20, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..