బ్యాటర్లు జర జాగ్రత్త.. డెడ్లీ కాంబినేషన్ సెట్.. లైట్ తీసుకుంటే వికెట్లు విరిగిపోతాయ్ రోయ్..!

MI Pace Attack: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి రావడంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్ ప్రత్యర్థి బ్యాటర్లకు కొత్త సవాల్‌గా మారనుంది.

బ్యాటర్లు జర జాగ్రత్త.. డెడ్లీ కాంబినేషన్ సెట్.. లైట్ తీసుకుంటే వికెట్లు విరిగిపోతాయ్ రోయ్..!
Jasprit Bumrah, Arshdeep Singh

Updated on: Nov 11, 2026 | 11:47 AM

MI Pace Attack: ఐపీఎల్ (IPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మరోసారి తమ బౌలింగ్ బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) జట్టులో చేరడంతో ముంబై బౌలింగ్ విభాగంపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే జట్టులో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వంటి ప్రపంచ స్థాయి బౌలర్ ఉండగా, ఇప్పుడు అర్ష్‌దీప్ కూడా తోడైతే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవనే చర్చ మొదలైంది. బుమ్రా, అర్ష్‌దీప్ కలిసి ఉన్న స్వాగత ఫొటో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

బుమ్రా, అర్ష్‌దీప్ కాంబినేషన్ అదుర్స్!

భారత జట్టులో బుమ్రా తన యార్కర్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించడంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోవైపు అర్ష్‌దీప్ స్వింగ్ బౌలింగ్‌తో పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ఎడమచేతి వాటం పేసర్ కావడం అతనికి అదనపు బలం. కొత్త బంతితో వికెట్లు తీయడంతో పాటు చివరి ఓవర్లలోనూ కీలకంగా వ్యవహరించగలడు.

ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!

ఇవి కూడా చదవండి

ప్రత్యర్థి బ్యాటర్లకు డబుల్ టెన్షన్!

బుమ్రా, అర్ష్‌దీప్ ఇద్దరూ ఒకే జట్టులో ఉంటే బౌలింగ్‌లో వైవిధ్యం పెరుగుతుంది. పవర్‌ప్లేలో అర్ష్‌దీప్ స్వింగ్, మధ్య ఓవర్లలో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, డెత్ ఓవర్లలో ఇద్దరి అనుభవం ముంబైకి ఉపయోగపడవచ్చు. వీరికి తోడుగా ఇతర పేసర్లు కూడా రాణిస్తే ముంబై బౌలింగ్ యూనిట్ మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చే ట్రేడ్!

అర్ష్‌దీప్ రాకతో ముంబై జట్టు పేస్ అటాక్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బుమ్రాతో కలిసి అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2027లో ఈ ఇద్దరు భారత పేసర్లు కలిసి బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లకు అది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. అందుకే ముంబై అభిమానులు ఇప్పటి నుంచే ఈ డేంజరస్ పేస్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us