MS Dhoni: చెన్నైను దగ్గరుండి మరీ ఓడించిన ధోని.. ఆ జట్టు చారిత్రాత్మక విజయంలో మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్..?

MS Dhoni's Secret Masterclass: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నా.. ధోనీకి తన సొంత రాష్ట్ర జట్టు అంటే ఉన్న మక్కువ మరోసారి చాటుకున్నారు. జార్ఖండ్ సాధించిన ఈ విజయం ఆ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దీని వెనుక 'కెప్టెన్ కూల్' హస్తం ఉండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

MS Dhoni: చెన్నైను దగ్గరుండి మరీ ఓడించిన ధోని.. ఆ జట్టు చారిత్రాత్మక విజయంలో మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్..?
Ms Dhoni Ishan Kishan

Updated on: Dec 26, 2025 | 8:38 PM

MS Dhoni’s Secret Masterclass: భారత దేశవాళీ క్రికెట్‌లో ఒక కొత్త చరిత్ర లిఖించబడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025 సీజన్‌లో జార్ఖండ్ జట్టు అనూహ్య రీతిలో ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో పటిష్టమైన తమిళనాడును ఓడించి తొలిసారిగా ఈ టైటిల్‌ను ముద్దాడింది. అయితే, ఈ అద్భుత విజయం వెనుక టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ మంత్రం..

జార్ఖండ్ జట్టు టోర్నీ ఆరంభంలో అంతగా రాణించలేదు. కానీ, కీలకమైన నాకౌట్ దశకు ముందు ధోనీ జట్టు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాంచీలోని జేఎస్‌సీఏ (JSCA) స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ల సమయంలో ధోనీ యువ ఆటగాళ్లతో గంటల తరబడి గడిపారు. ఒత్తిడి ఉన్న సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీ ఆటగాళ్లకు వివరించారు. ప్రత్యర్థి జట్టు బలహీనతలను ఎలా వాడుకోవాలో, ఫీల్డింగ్ సెటప్ ఎలా ఉండాలో వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్, కెప్టెన్‌కు విలువైన సూచనలు చేశారు.

ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు..

జార్ఖండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్, ధోనీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “మహి భాయ్ మాకు కేవలం సలహాలు ఇవ్వడమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో గేమ్ ప్లాన్‌ను ఎలా మార్చుకోవాలో నేర్పించారు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ముందు ఆయన ఇచ్చిన స్పీచ్ మాలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఫలితం గురించి ఆలోచించకుండా, ప్రక్రియ మీద దృష్టి పెట్టమని ఆయన చెప్పిన మాటే మమ్మల్ని విజేతలుగా నిలిపింది,” అని ఇషాన్ తెలిపారు.

యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం..

కేవలం స్టార్ ఆటగాళ్లకే కాకుండా, జట్టులోని కుమాన్ కుశాగ్ర, పంకజ్ యాదవ్ వంటి యువ ప్లేయర్లకు ధోనీ వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చారు. నెట్స్ లో వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోనీ దగ్గరుండి వారి టెక్నిక్‌ను సరిదిద్దారు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ధోనీ నిశబ్దంగా చేసిన ఈ సాయాన్ని ప్రశంసించారు. ఆయన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటమే ఒక పెద్ద బలాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నా.. ధోనీకి తన సొంత రాష్ట్ర జట్టు అంటే ఉన్న మక్కువ మరోసారి చాటుకున్నారు. జార్ఖండ్ సాధించిన ఈ విజయం ఆ రాష్ట్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దీని వెనుక ‘కెప్టెన్ కూల్’ హస్తం ఉండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..