AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : బౌలర్‌గా ధోనీ ఎంట్రీ? నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన ‘తలా’.. వీడియో వైరల్

MS Dhoni : ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 50కి పైగా మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ధోనీ ఒక్కసారి కూడా తుది జట్టులో కనిపించలేదు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

MS Dhoni : బౌలర్‌గా ధోనీ ఎంట్రీ? నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన 'తలా'.. వీడియో వైరల్
Ms Dhoni
Rakesh
|

Updated on: May 08, 2026 | 7:43 AM

Share

MS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నా, కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఆ ఒక్క క్షణం ఇంకా రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఎప్పుడూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించే ధోనీ, ఈసారి బంతితో మైదానంలో కనిపిస్తుండటంతో “ధోనీ బ్యాటర్ లా కాదు.. బౌలర్‌గా వస్తున్నాడా?” అనే చర్చ మొదలైంది.

చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌లో మే 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. సాధారణంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే ధోనీ, ఈసారి చిన్న రన్-అప్‌తో స్పిన్ బౌలింగ్ చేస్తూ కనిపించారు. నవ్వుతూ సరదాగా బౌలింగ్ చేస్తున్న ధోనీ వీడియో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఆయన కేవలం సరదాగా బౌలింగ్ చేశారా? లేక నిజంగానే బౌలర్‌గా బరిలోకి దిగుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆడకపోవడానికి అసలు కారణం ఇదేనా?

ఈ సీజన్‌లో ధోనీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడానికి ఫిట్‌నెస్ సమస్యలే ప్రధాన కారణమని తెలుస్తోంది. మోకాలి సమస్య కారణంగా ధోనీ వేగంగా పరుగెత్తలేకపోతున్నారని, అందుకే ఆయన తుది జట్టులో కనిపించడం లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. గతంలో ఆయన బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేసినా, పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాలేదు. లక్నోతో మ్యాచ్ నాటికైనా ధోనీ మైదానంలోకి వస్తారని చెన్నై ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలు

ఐపీఎల్ 2026లో ఇప్పటికే 50 మ్యాచ్‌లు ముగిశాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 10 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు ఓటములను చవిచూసినా, ఆ తర్వాత పుంజుకుని అద్భుత ప్రదర్శన చేస్తోంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే చెన్నైకి మిగిలిన 4 మ్యాచ్‌లలో కనీసం 3 విజయాలు తప్పనిసరి. ఇలాంటి కీలక సమయంలో ధోనీ జట్టులోకి వస్తే అది సీఎస్కేకు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

బౌలింగ్ కోచ్ ఏమన్నారంటే?

ధోనీ రీఎంట్రీ గురించి చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ స్పందిస్తూ.. ధోనీ ఎప్పుడు వస్తారనే దానిపై స్పష్టమైన తేదీ లేదని వెల్లడించారు. ధోనీ ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు జట్టులోకి తీసుకుంటామని తెలిపారు. ఏదేమైనా ధోనీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించడం మాత్రం ఆయన ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. బహుశా ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయినా ధోనీని ఈ సీజన్‌లో చూసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు