
Most Centuries: క్రికెట్‌లో వికెట్ కీపర్ బాధ్యత కేవలం వికెట్ల వెనుక బంతిని పట్టుకోవడంతోనే ముగియదు. ప్రస్తుత రోజుల్లో చాలామంది వికెట్ కీపర్లు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ తమ జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు అందిస్తున్నారు. అందుకే వికెట్ కీపర్-బ్యాటర్ల సెంచరీల రికార్డు ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లు టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి చూస్తే ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ 33 అంతర్జాతీయ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత క్వింటన్ డి కాక్, కుమార సంగక్కర నిలిచారు.
1. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 33 సెంచరీలు
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో 17, వన్డేల్లో 16 సెంచరీలు సాధించి వికెట్ కీపర్ బ్యాటింగ్ శైలికి సరికొత్త గ్లామర్ తెచ్చిపెట్టాడు.
2. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – 31 సెంచరీలు
దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 31 సెంచరీలతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. టెస్టుల్లో 6, వన్డేల్లో 23, టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 2 సెంచరీలు చేసి గిల్‌క్రిస్ట్ రికార్డుకు అతి సమీపంలోకి వచ్చాడు.
3. కుమార సంగక్కర (శ్రీలంక) – 30 సెంచరీలు
శ్రీలంక దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగక్కర తన అంతర్జాతీయ కీపింగ్ కెరీర్‌లో 30 సెంచరీలు సాధించాడు. ఇందులో టెస్టుల్లో 7, వన్డేల్లో 23 సెంచరీలు ఉన్నాయి.
4. షాయ్ హోప్ (వెస్టిండీస్) – 21 సెంచరీలు
వెస్టిండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ 21 అంతర్జాతీయ సెంచరీలతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇందులో 19 వన్డేలు, ఒక టెస్ట్, ఒక టి20 సెంచరీ ఉన్నాయి.
5. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 17 సెంచరీలు
దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఎబి డివిలియర్స్ వికెట్ కీపర్‌గా 17 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 10 సెంచరీలు బాదాడు.
6. ఎంఎస్ ధోనీ (భారత్) – 16 సెంచరీలు
భారత దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో 16 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఆరో స్థానంలో నిలిచాడు. ధోనీ టెస్టుల్లో 6, వన్డేల్లో 10 సెంచరీలు పూర్తి చేశాడు.
7. ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) – 16 సెంచరీలు
జింబాబ్వే ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడు ఆండీ ఫ్లవర్ 16 సెంచరీలతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఫ్లవర్ టెస్టుల్లో 12, వన్డేల్లో 4 సెంచరీలు సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..