PAK vs NZ, ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు న్యూజిలాండ్ ఎదుట భారీ టార్గెట్ ఉంచారు. మహ్మద్ నవాజ్, అఘా సల్మాన్ మినహా జట్టులోని ఏ ప్లేయర్‌కి కూడా భారత గడ్డపై ఆడిన అనుభవం లేదు, అయినా ఆడిన తొలి ఆటలోనే ఆకట్టుకున్నారు. తొలి సారి భారత్‌లో ఆడిన మహ్మద్ రిజ్వాన్ (103, నాటౌట్, రిటైర్డ్ హర్ట్) తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయగా.. కెప్టెన్ బాబర్ అజామ్ (80), సౌద్ షకీల్ (75) కూడా మన దేశంలో తొలి అర్ధ సెంచరీలతో మెరిశారు.
ఇప్పటికే భారత్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆఘా సల్మాన్ 33* పరుగులతో రాణించాడు. ఇలా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి.. న్యూజిలాండ్‌కి 346 పరుగులు భారీ లక్ష్యాన్ని విధించింది. ఇక బ్లాక్ క్యాప్ బౌలర్లలో మిచెల్ సాన్ట్నర్ 2 వికెట్లు తీసుకోగా.. మాట్ హెన్రీ, జేమ్స్ నిషామ్, లకీ ఫెర్గుసన్ తలో వికెట్ పడగొట్టారు.
Batters warm up in style 🔥
A glorious century by @iMRizwanPak and brilliant fifties by @babarazam258 and @saudshak take Pakistan to 345-5 💪#NZvPAK | #CWC23 | #WeHaveWeWill pic.twitter.com/JWSl9FfAHG
— Pakistan Cricket (@TheRealPCB) September 29, 2023
💯 up for @iMRizwanPak ✨
It's been a quality innings from him as he is retired out for 103 off 94 balls 👏#NZvPAK | #CWC23 | #WeHaveWeWill pic.twitter.com/ipnw3hyNnA
— Pakistan Cricket (@TheRealPCB) September 29, 2023
కాగా, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడేందుకు భారత్‌కి వచ్చిన పాకిస్తాన్ జట్టులో మహ్మద్ నవాజ్, ఆఘా సల్మాన్ మాత్రమే ఇంతక ముందు మన దేశానికి వచ్చారు. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ వీరిద్దరూ షాహిద్ అఫ్రిదీ నేతృత్వంలో ఇక్కడకు వచ్చారు. అప్పటికే బాబర్ అజామ్ పాక్ జట్టులో భాగం అయినప్పటికీ.. గాయం కారణంగా టోర్నీ కోసం ఎంపిక కాలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..