Video: బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో క్యాచ్.. వీడియో చూస్తే పరేషానే..!

Telangana Cricket Tournament: క్రికెట్ మ్యాచ్‌లలో కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. ఒకే ఒక్క అద్భుతమైన క్యాచ్ కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలదని ఈ ఘట్టం నిరూపించింది. ఒంటిచేత్తో మిఖిల్ జైస్వాల్ ప్రదర్శించిన ఈ విన్యాసం యువ ఆటగాళ్లకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మున్ముందు ఈ టోర్నమెంట్‌లో ఇలాంటి ఇంకెన్ని అద్భుతాలు నమోదవుతాయో అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Video: బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో క్యాచ్.. వీడియో చూస్తే పరేషానే..!
Tg20 Mikhil Jaiswal Catch

Updated on: Jul 05, 2026 | 8:18 AM

Mikhil Jaiswal Catch Video: శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఒక కళ్లు చెదిరే విన్యాసం చోటుచేసుకుంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ మిఖిల్ జైస్వాల్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో పట్టిన నమ్మశక్యం కాని క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అద్భుత క్యాచ్‌ను చూసిన నెటిజన్లు టోర్నమెంట్‌లో ఇదే అత్యుత్తమ క్యాచ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

గాల్లో తేలియాడిన ఫీల్డర్..

ఈ మ్యాచ్‌లో హర్షిత్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికి నితిన్ సాయి భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచి బౌండరీ లైన్ దాటి సిక్సర్‌గా వెళ్తుందని అందరూ భావించారు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మిఖిల్ జైస్వాల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి, బౌండరీ లైన్‌కు కొద్దిగా ముందుకు దూకి, గాల్లోకి లేచి ఒంటిచేత్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

ఇవి కూడా చదవండి

మైండ్ బ్లోయింగ్ బ్యాలెన్స్..

క్యాచ్ పట్టే క్రమంలో మిఖిల్ జైస్వాల్ శరీరం మొత్తం గాల్లోనే ఉంది. కిందకు ల్యాండ్ అయ్యే సమయంలో అతని కాలు కొద్దిగా ట్విస్ట్ అయినప్పటికీ, అతను తన నియంత్రణను ఏమాత్రం కోల్పోలేదు. బౌండరీ లైన్ తాడుకు అత్యంత సమీపంలో ఉన్నా, తన శరీరాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ వెనక్కి పడిపోకుండా నిలదొక్కుకున్నాడు. మైదానంలో ఉన్న అంపైర్లు దీనిని క్షుణ్ణంగా పరిశీలించి అవుట్‌గా ప్రకటించారు. దీంతో 19 పరుగులు చేసిన నితిన్ సాయి నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది.

Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!

నెటిజన్లను ఫిదా చేస్తున్న సంబరాలు..

ఈ అద్భుతమైన క్యాచ్ తర్వాత మిఖిల్ జైస్వాల్ చేసిన సంబరాలు కూడా మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇరు చేతులు చాచి అతను ఇచ్చిన హావభావాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వ్యాఖ్యాతలు సైతం ఈ ఫీల్డింగ్ విన్యాసానికి ఫిదా అయిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రొఫెషనల్ క్రికెటర్లు పట్టే క్యాచ్‌లకు ఇది ఏమాత్రం తీసిపోదని కొనియాడారు. మిఖిల్ జైస్వాల్ ఇదివరకు కూడా మంచి ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఈ క్యాచ్‌తో తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us