Mumbai Indians vs Sunrisers Hyderabad Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 69వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18 ఓవర్లలో ఛేదించింది. కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వల్ 4 వికెట్లు తీశాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది.
మయాంక్ అగర్వాల్ 83 పరుగులు చేయగా, వివ్రాంత్ శర్మ 69 పరుగులతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఆకాష్ మధ్వల్ 4 వికెట్లు, క్రిస్ జోర్డాన్ 1 వికెట్ తీశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో ఈరోజు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ చివరి రోజు మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ప్రారంభమైంది. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
ముంబైలో తమ జట్టులో ఒక మార్పు చేసింది. హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తికేయకు అవకాశం దక్కింది. మయాంక్ అగర్వాల్ తిరిగి SRHలోకి వచ్చాడు, వివ్రాంత్ శర్మతో పాటు సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు కూడా అవకాశం ఇచ్చింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
SRH ఇంపాక్ట్ ప్లేయర్స్: మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
MI ఇంపాక్ట్ ప్లేయర్స్: రమణదీప్ సింగ్, విష్ణు వినోద్. ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్.
201 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18 ఓవర్లలో ఛేదించింది. కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వల్ 4 వికెట్లు తీశాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఇషాన్ కిషన్ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ అజేయమైన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ముంబై ఇండియన్స్‌కి విజయం అందించాడు. ఈ క్రమంలోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో ఆరెంజ్ ఆర్మీ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ఇక ఒక పరుగు చేసే తనకు సెంచరీ, టీమ్‌కి విజయం అందుతుందన్న సమయంలో సింగిల్ తీసి.. రెండు పనులూ పూర్తి చేశాడు.
14 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 2 వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. గ్రీన్ 75 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
12 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఒక వికెట్ నష్టపోయి 132 పరుగులు చేసింది. రోహిత్ 55, గ్రీన్ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 112 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ముంబై విజయానికి 48 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కామెరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరిన తర్వాత వచ్చిన గ్రీన్ 20 బంతుల్లోనే 50 పరుగులు చేసి అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇక మరో ఎండ్‌లో కెప్టెన్ రోహిత్ 31 పరుగులతో ఉన్నాడు.
చివరి మ్యాచ్‌లో ఫినిషర్‌గా ముంబై టీమ్‌కి విజయం అందించలేకపోయిన కామెరూన్ గ్రీన్ నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై సిక్సర్ల మోత పుట్టిస్తున్నాడు. ఎదుర్కొన్న 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు చేసి.. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరోవైపు ముంబై టీమ్ సారథి రోహిత్(16) ఉన్నాడు.
5 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(14) పెవిలియన్ చేరాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది.
17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది.
12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 111 పరుగులు చేసింది. వివ్రాంట్ 36 బంతుల్లో తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని పూర్తి చేశాడు.
10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 35, వివ్రాంత్ శర్మ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 93 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొంది.
8 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 30, వివ్రాంత్ శర్మ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 74 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొంది.
6 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 21, వివ్రాంత్ శర్మ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లు ముగిసేసరికి జట్టు వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
MI ఇంపాక్ట్ ప్లేయర్స్: రమణదీప్ సింగ్, విష్ణు వినోద్. ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
SRH ఇంపాక్ట్ ప్లేయర్స్: మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్.
కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో ఈరోజు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీం.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.