ఐపీఎల్ 2022(IPL 2022)లో శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈరోజు మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్ మధ్య జరగనుంది. ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు తొలి విజయం కోసం కసరత్తు చేస్తోంది. రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో ముంబైలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు వెళ్లే మార్గం జట్టుకు కష్టతరంగా మారింది. ప్రస్తుతం వారికి విజయమే ఏకైక మార్గం. మరోవైపు తొలి సీజన్‌లోనే అద్భుత ఆటతీరు కనబరుస్తున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఈ సీజన్‌లో తొలిసారి ఆడుతోంది.
ఇప్పటి వరకు లక్నో జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబై టీంను ఢిల్లీ, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ టీమ్స్ ఓడించాయి.
మార్పులు లేని రాహుల్ టీమ్..
ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ జట్టు ఓడిపోయి ఉండవచ్చు. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌లో జట్టు మారే అవకాశాలు చాలా తక్కువ. కెప్టెన్ రాహుల్ ఖచ్చితంగా బ్యాడ్ రిథమ్‌లో ఉన్నాడు. అయితే, మిగతా ఆటగాళ్లందరూ బలమైన ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్‌లో క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్‌తోపాటు బౌలింగ్‌లో అవేశ్‌ఖాన్, జాసన్ హోల్డర్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ జట్టు మారక తప్పదని భావిస్తున్నారు. గత మ్యాచ్‌లో ఇవాన్ లూయిస్, ఆండ్రూ టైలను తొలగించి మార్కస్ స్టోయినిస్, చమీరాలను జట్టులోకి తీసుకున్నారు. వారు జట్టులో కొనసాగుతారు.
ముంబైలో మార్పు..
అదే సమయంలో, ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో చాలా కష్టపడుతోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. శాశ్వత ప్లేయింగ్ XIని ఎంచుకోకపోవడమే ముంబైకు పెద్ద సమస్యగా మారింది. జట్టు బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా మినహా మరే బౌలర్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో, విజయం కోసం మార్పులు చేయవచ్చు. ఫాబియన్ అలెన్ లేదా రైలీ మెరెడిత్‌కు అవకాశం ఇవ్వవచ్చు.
లక్నో ప్రాబబుల్ ప్లేయింగ్ XI – కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
ముంబై ప్రాబబుల్ ప్లేయింగ్ XI – రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్/రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్
IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..