MI vs KKR Highlights IPL 2022 : ముంబై 113 పరుగులకి ఆలౌట్‌.. 52 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం

|

May 09, 2022 | 11:34 PM

Mumbai Indians vs Kolkata Knight Riders Highlights: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఢీకొట్టనున్నాయి. ఇప్పటి వరకు...

MI vs KKR Highlights IPL 2022 : ముంబై 113 పరుగులకి ఆలౌట్‌.. 52 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం
Mi Vs Kkr Match

Mumbai Indians vs Kolkata Knight Riders Highlights: ఐపీఎల్‌ 2022లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై చతికిలపడింది. 17.3 ఓవర్లలో 113 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో కోల్‌కతా 52 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ముంబై ప్లేయర్లలో ఇషాన్‌ కిషన్‌ 51 పరుగులు మినహాయించి ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కోల్‌కతా బౌలర్ల ముందు ముంబై బ్యాటర్లు నిలవలేకపోయారు. వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ముఖ్యంగా ప్యాట్‌ కమిన్స్‌ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి ముంబయిని చావుదెబ్బ కొట్టాడు. ఆండ్రూ రస్సెల్‌ 2, టిమ్‌ సౌథీ 1, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్‌ చొప్పున సాధించారు. ముంబయి తొమ్మిదో ఓటమిని నమోదు చేసుకోగా.. కోల్‌కతాకిది ఐదో విజయం.. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా (10) ఏడో స్థానానికి చేరుకుంది.

అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెన్‌ వెంకటేష్‌ అయ్యర్‌ (43), అజింక్యా రహాన్‌ (25) మంచి పాట్నర్‌షిప్‌ నమోదు చేశారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్స్‌లో బుమ్రా చెలరేగాడు. 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇక కార్తికేయ 2 వికెట్లు తీసుకోగా, డేనియల్‌ సామ్స్‌, అశ్విన్‌ చేరో ఒక వికెట్‌ సాధించారు.

ఇరు జట్ల ప్లేయర్స్‌.. (అంచనా)

ముంబై ఇండియన్స్‌: ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ/బాసిల్ థంపి, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్/అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా, షెల్డన్ జాక్సన్/బాబా ఇంద్రజిత్ (WK), ఆండ్రీ రస్సెల్, అమన్ ఖాన్/అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్/హర్షిత్ మావి రానా

Key Events

కోల్‌కతా వైఫల్యానికి కారణాలివే..

బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, మంచి బ్యాటింగ్ లైనప్‌ ఉన్నా సులువైన టార్గెట్‌ను కూడా ఛేజింగ్‌ చేయకపోవడం.

ముంబై పేవల ప్రదర్శన..

ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలార్డ్‌ విఫలయ్యాడు. వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓడిపోయి చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 09 May 2022 11:09 PM (IST)

    ముంబై 113 పరుగులకి ఆలౌట్‌.. 52 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం

    ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకి ఆలౌట్‌ అయింది. కోల్‌కతా 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ప్లేయర్లలో ఇషాన్‌ కిషన్‌ 51 పరుగులు మినహాయించి ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇక కోల్‌కతా బౌలర్లలో పాట్‌ కమిన్స్‌ 3, ఆండ్రూ రస్సెల్‌ 2, టిమ్‌ సౌథీ 1, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్‌ సాధించారు.

  • 09 May 2022 11:04 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. కీరన్‌ పొలార్డ్ 15 పరుగుల వద్ద రన్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో ముంబై 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. విజయానికి 53 పరుగులు చేయాలి.

  • 09 May 2022 11:02 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కుమార్‌ కార్తీకేయ 5 పరుగుల వద్ద రన్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో ముంబై 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 17 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 May 2022 10:49 PM (IST)

    15 ఓవర్లకి ముంబై 102/7

    15 ఓవర్లకి ముంబై 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. క్రీజులో కీరన్‌ పొలార్డ్‌ 10 పరుగులు, కుమార్‌ కార్తీకేయ 0 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 29 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. కోల్‌కతా బౌలర్లలో పాట్‌ కమిన్స్‌ 3, ఆండ్రూ రస్సెల్‌ 2, టిమ్‌ సౌథీ 1, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్‌ సాధించారు.

  • 09 May 2022 10:48 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఏడో వికెట్‌ కోల్పోయింది. మురుగన్ అశ్విన్ డకౌట్‌ అయ్యాడు. దీంతో ముంబై 7 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 30 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 May 2022 10:46 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఆరో వికెట్‌ కోల్పోయింది. డేనియల్‌ సామ్స్‌ 1 పరుగుకే ఔటయ్యాడు. దీంతో ముంబై 6 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 31 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 May 2022 10:45 PM (IST)

    100 పరుగులు దాటిన ముంబై

    ముంబై 14.2 ఓవర్లలో 101 పరుగులు దాటింది. క్రీజులో కీరన్‌ పొలార్డ్ 10 పరుగులు, డేనియల్‌ సామ్స్‌ 1పరుగుతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 33 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్‌ 2,పాట్‌ కమిన్స్‌ 2, టిమ్‌ సౌథీ 1, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్‌ సాధించారు.

  • 09 May 2022 10:42 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ 51 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 35 బంతుల్లో 66 పరుగులు చేయాల్సి ఉంది. కమిన్స్‌ బౌలింగ్‌లో రింకుసింగ్‌ క్యాచ్‌ తీసుకోవడంతో వెనుదిరిగాడు.

  • 09 May 2022 10:40 PM (IST)

    100 పరుగులు దాటిన ముంబై

    ముంబై 14 ఓవర్లలో 100 పరుగులు దాటింది. క్రీజులో ఇషాన్‌ కిషన్ 51 పరుగులు, కీరన్ పొలార్డ్‌ 9 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 36 బంతుల్లో 66 పరుగులు చేయాల్సి ఉంది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్‌ 2, టిమ్‌ సౌథీ 1, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్‌ సాధించారు.

  • 09 May 2022 10:39 PM (IST)

    ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ

    ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. ముంబై ఇప్పటివరకు 4 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. విజయానికి 37 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 May 2022 10:34 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై నాలుగో వికెట్‌ కోల్పోయింది. టిమ్‌ డేవిడ్‌ 13 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ముంబై 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 46 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 May 2022 10:25 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై

    ముంబై మూడో వికెట్‌ కోల్పోయింది. రామన్‌ దీప్‌ సింగ్‌ 12 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ముంబై 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 57 బంతుల్లో 97 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 May 2022 10:21 PM (IST)

    10 ఓవర్లకి ముంబై 66/2

    10 ఓవర్లకి ముంబై 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. క్రీజులో రామన్‌ దీప్‌ సింగ్‌ 12 పరుగులు, ఇషాన్‌ కిషన్ 39 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 100 పరుగులు చేయాల్సి ఉంది.

  • 09 May 2022 09:42 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై ఇండియన్స్‌..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇచ్చిన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ శర్మ టిమ్‌ సౌతీ బౌలింగ్‌లో జాక్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 09 May 2022 09:25 PM (IST)

    ముంబై ఇండియన్స్‌ లక్ష్యం ఎంతంటే..

    టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెన్‌ వెంకటేష్‌ అయ్యర్‌ (43), అజింక్యా రహాన్‌ (25) మంచి పాట్నర్‌షిప్‌ అందించినా. తర్వాత కోల్‌కతా వరుస వికెట్లను కోల్పోయింది. దీంతో కోల్‌కత తక్కువ స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్స్‌లో బుమ్రా చెలరేగాడు. 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా ఏకంగా 5 వికెట్లు పడగొట్టి కోల్‌కతా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టించాడు. ఇక కార్తికేయ 2 వికెట్లు తీసుకోగా, డేనియల్‌ సామ్స్‌, అశ్విన్‌ చేరో ఒక వికెట్‌ తీసుకున్నారు.

  • 09 May 2022 09:10 PM (IST)

    కొనసాగుతోన్న కోల్‌కతా వికెట్ల పతనం..

    సునీల్‌ నరైన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా 156 పరుగులకు గాను 8 వికెట్లు కోల్పోయింది.

  • 09 May 2022 09:06 PM (IST)

    మరో వికెట్ డౌన్‌..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో షెల్డన్‌ జాక్సన్‌ డేనియల్‌ సామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 09 May 2022 08:52 PM (IST)

    వెను దిరిగిన నితీశ్‌ రానా..

    26 బంతుల్లో 43 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ పెంచే ప్రయత్నం చేసిన నితీశ్‌ రానా అవుట్‌ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. దీంతో కోల్‌కతా 5వ వికెట్‌ను కోల్పోయింది.

  • 09 May 2022 08:48 PM (IST)

    నాలుగో వికెట్ డౌన్‌..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చిన ఆండ్రీ రస్సెల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రస్తుతం కోల్‌కతా స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 136 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 09 May 2022 08:41 PM (IST)

    మూడో వికెట్ డౌన్‌..

    కోల్‌కతా నైట్ రైడర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్ 6 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కోల్‌కతా 123 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 09 May 2022 08:28 PM (IST)

    వంద పరుగులకు కోల్‌కతా స్కోర్‌..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్‌ బోర్డ్‌ 100 పరుగుల మార్క్‌ను చేరుకుంది. అజింక్యా రహానే 25 పరగుల వద్ద అవుట్‌ అయ్యాడు. కుమార్‌ కార్తికేయ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఇక ప్రస్తుతం కోల్‌కతా స్కోర్‌ బోర్డ్‌ 2 వికెట్ల నష్టానికి 100 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 09 May 2022 07:59 PM (IST)

    కోల్‌కతా జోరుకు బ్రేక్‌..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. కేవలం 24 బంతుల్లోనే 43 పరుగులతో జోరు మీదున్న వెంకటేష్‌ అయ్యర్‌ అవుట్‌ అయ్యాడు. కుమార్‌ కార్తికేయ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 09 May 2022 07:57 PM (IST)

    రాణిస్తోన్న కోల్‌కతా ఓపెనర్లు..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు స్కోర్‌ 50 పరుగులు దాటేసింది. వెంకటేష్‌ అయ్యర్‌ దూకుడుగా ఆడుతుండడంతో జట్టు స్కోరు పెరుగుతోంది. ఇక రహనే వెంకటేష్‌కు మద్దతుగా నిలుస్తూ వికెట్ పోకుండా కాపాడుతున్నాడు.

  • 09 May 2022 07:43 PM (IST)

    కోల్‌కతా బ్యాటర్ల శుభారంభం..

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాటర్లు జట్టుకు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. మూడు ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా స్కోర్‌ 26 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే (4), వెంకటేష్‌ అయ్యర్‌ (20) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 09 May 2022 07:09 PM (IST)

    ఇరు జట్ల ప్లేయర్స్‌..

    ముంబై ఇండియన్స్‌: ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా, రింకూ సింగ్‌, ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌, షెల్డన్‌ జాక్సన్‌, పాట్ కమిన్స్‌, టిమ్‌ సౌతీ, వరుణ్‌ చక్రవర్తి.

  • 09 May 2022 07:03 PM (IST)

    టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌..

    టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. డ్యూ ప్రభావం చూపనుండడం, పిచ్‌ ఛేజింగ్‌కు అనుకూలిస్తుండడంతో రోహిత్‌ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ముంబై సారథి తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టుకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

  • 09 May 2022 06:34 PM (IST)

    కోల్‌కతా సపోర్టర్స్‌ హంగామా..

    ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరుగుతోన్న మ్యాచ్‌ కోసం కోల్‌కతా టీమ్‌ చేరుకుంది. ఈ సందర్భంగా కోల్‌కతా సపోర్టర్స్‌ స్టేడియం బయట ప్లేయర్స్‌కు అభవాదం చేశారు.

Follow us on