IPL 2023: ఐపీఎల్ బ్రదర్స్.. లిస్టులో 10 మంది.. కొత్తగా ఎవరొచ్చారంటే?

Duan Jansen, Marco Jansen: ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డువాన్ జాన్సెన్‌ను చేర్చుకుంది. ఇంతకుముందు, డువాన్ జాన్సెన్ సోదరుడు మార్కో జాన్సెన్ కూడా ముంబై ఇండియన్స్ తరపున IPL ఆడాడు.

IPL 2023: ఐపీఎల్ బ్రదర్స్.. లిస్టులో 10 మంది.. కొత్తగా ఎవరొచ్చారంటే?
Marco Jansen, Duan Jansen

Updated on: Apr 16, 2023 | 8:25 PM

IPL Brothers: ఈరోజు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డువాన్ జాన్సన్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకుముందు, డువాన్ జాన్సెన్ సోదరుడు మార్కో జాన్సెన్ కూడా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అయితే, ఇప్పుడు మార్కో జాన్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో ఆడిన సోదరులు..

డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్ IPLలో ఆడిన సోదరుల్లో పదవ జంటగా నిలిచారు. ఈ జాబితాలో ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌లు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ IPLలో ఆడిన మొదటి సోదరుల జంట. అదే సమయంలో, ఈ జాబితాలో షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ రెండవ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మైక్ హస్సీ, డేవిడ్ హస్సీలు కూడా ఐపీఎల్‌లో ఆడారు. ఇది కాకుండా దక్షిణాఫ్రికాకు చెందిన అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ ఉన్నారు.

ఈ జాబితాలో తర్వాతి పేరు వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావోలది. అదే సమయంలో, భారత క్రికెటర్ సోదరులు సిద్ధార్థ్ కౌల్, ఉదయ్ కౌల్ కూడా ఉన్నారు. హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ఐపీఎల్‌ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సోదరులు సామ్‌ కుర్రాన్‌, టామ్‌ కుర్రాన్‌ కూడా ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్ రూపంలో కొత్తగా చేరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..