MI vs DC, IPL 2022: ఢిల్లీ టార్గెట్ 178.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్..

Mumbai Indians vs Delhi Capitals: నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు పూర్తి చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 178 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇషాన్ కిషన్ 81 పరగులతో..

MI vs DC, IPL 2022: ఢిల్లీ టార్గెట్ 178.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్..
Ipl 2022 Dc Vs Mi Ishan Kishan

Updated on: Mar 27, 2022 | 5:18 PM

ఈరోజు ఐపీఎల్‌లో సండేలో భాగంగా తొలి మ్యాచ్‌లో బ్రాబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి ఇండియన్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు పూర్తి చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 178 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇషాన్ కిషన్ 81 పరగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 41, తిలక్ వర్మ 22, సింగ్ 8, పొలార్డ్ 3, టిమ్ డేవిడ్ 12 పరుగులు చేశారు. టాస్ గెలిచిన ఢిల్లీ టీం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై టీం తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్, ఇషాన్ తుఫాన్ ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

చైనామన్ కుల్దీప్ ఢిల్లీ టీంకు బ్రేక్ త్రూ అందించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ వైపు కదులుతున్న సమయంలో రోహిత్‌ను స్పిన్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.

ప్లేయింగ్ XI:
DC : పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ (w/c), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, కమలేష్ నాగర్‌కోటి.

MI : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి.