Deodhar Trophy 2023, Mayank Agarwal: దేవధర్ ట్రోఫీ 11వ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టు భారీ విజయం సాధించింది. పుదుచ్చేరిలోని క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ సౌరభ్ తివారీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ కు తొలి షాక్ ఇవ్వడంలో వాసుకి కౌశిక్ సఫలమయ్యాడు. అభిమన్యు ఈశ్వరన్ (12)ను పెవిలియన్ చేర్చి వాసుకి కౌశిక్ సౌత్ జోన్ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. అయితే దీని తర్వాత విరాట్ సింగ్ (49), సుభ్రాంశు సేనాపతి (44) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
ఈ దశలో దాడికి దిగిన వాషింగ్టన్ సుందర్ విరాట్ సింగ్ వికెట్ తీయగా, సాయి కిషోర్ సుభ్రాంశు మరో వికెట్ పడగొట్టాడు. ఈ రెండు వికెట్ల పతనంతో ఈస్ట్ జోన్ జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ సమయంలో మ్యాచ్‌పై పట్టు సాధించిన సౌత్ జోన్ బౌలర్లు ఈస్ట్ జోన్ జట్టును 46 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ చేశారు. సౌత్ జోన్ తరపున వాసుకి కౌశిక్, సాయి కిషోర్ 3 వికెట్లు తీయగా, విద్వాత్ కవేరప్ప 2 వికెట్లు తీశారు.
230 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన సౌత్ జోన్ జట్టుకు మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించాడు. మయాంక్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి 88 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్లతో 84 పరుగులు చేశాడు.
3వ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ 67 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మరోవైపు ఎన్ జగదీశన్ 32 పరుగులు చేశాడు. ఫలితంగా 230 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ జట్టు 44.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి చేరుకుంది. దీంతో సౌత్ జోన్ జట్టు దేవధర్ ట్రోఫీలో వరుసగా 4వ విజయాన్ని అందుకోవడం ద్వారా విజయాల పరంపరను కొనసాగిస్తోంది.
ఈస్ట్ జోన్ ప్లేయింగ్ 11: అభిమన్యు ఈశ్వరన్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, సౌరభ్ తివారీ (కెప్టెన్), ర్యాన్ పరాగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్, అవినోవ్ చౌదరి, ఆకాశ్ దీప్, ముఖ్తార్ హుస్సేన్.
సౌత్ జోన్ ప్లేయింగ్ 11: రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, అరుణ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, రోహిత్ రాయుడు, వాసుకి కౌశిక్, విజయ్ కుమార్ వైశాఖ్, విద్వాత్ కావవీరప్ప.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..