IND vs WI 3rd ODI: ఉత్కంఠగా మారిన మూడో వన్డే.. ప్లేయింగ్ 11లో భారీ మార్పులు.. శాంసన్ ప్లేస్ డౌటేనా?

|

Jul 31, 2023 | 7:00 AM

West Indies vs India, 3rd ODI: భారత్-వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. దీంతో మూడో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 1న ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ నిర్ణయాత్మకమైనందున, టీమిండియా గెలిచి తన హోదాను నిలబెట్టుకోవడం తప్పనిసరిగా మారింది.

IND vs WI 3rd ODI: ఉత్కంఠగా మారిన మూడో వన్డే.. ప్లేయింగ్ 11లో భారీ మార్పులు.. శాంసన్ ప్లేస్ డౌటేనా?
Ind Vs Wi 3rd Odi
Follow us on

West Indies vs India, 3rd ODI: భారత్-వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. దీంతో మూడో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 1న ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ నిర్ణయాత్మకమైనందున, టీమిండియా గెలిచి తన హోదాను నిలబెట్టుకోవడం తప్పనిసరిగా మారింది.

ఎందుకంటే వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలమైన వెస్టిండీస్‌తో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. తద్వారా ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ప్లాన్ వేసింది.

ఈ మ్యాచ్ DD స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. Jio సినిమా యాప్, వెబ్‌సైట్‌లలో కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడాకేష్ మోతీ, జాడెన్ సీల్స్, కేసీ కార్తీ, ఒషాన్ థామస్, అల్జారీ థామస్, కెవిన్ సింక్లైర్.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, యుజువేంద్ర చాహల్, సంజూ శాంసన్, జయదేవ్ ఉనద్కత్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..