దిగజారి పోస్టులు చేస్తున్నారు.. ఎందుకు ఇలా.. మార్పు రావాల్సిందే..

|

Nov 11, 2021 | 4:15 PM

Virat Kohli: ఏమైంది.. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆటలో ఓడిపోతే.. చంటిపాపపై దాడి చేస్తానని బెదిరిస్తారా.. ఏమిటీ సంస్కృతి.. గెలుపోటములు సహజమైన ఆటలో ఓడితే ఇలా చేస్తారా.. సోషల్ మీడియాలో పోస్టులపై వస్తున్న స్పందన ఇది....

దిగజారి పోస్టులు చేస్తున్నారు.. ఎందుకు ఇలా.. మార్పు రావాల్సిందే..
Kohli
Follow us on

ఏమైంది.. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆటలో ఓడిపోతే.. చంటిపాపపై దాడి చేస్తానని బెదిరిస్తారా.. ఏమిటీ సంస్కృతి.. గెలుపోటములు సహజమైన ఆటలో ఓడితే ఇలా చేస్తారా.. సోషల్ మీడియాలో పోస్టులపై వస్తున్న స్పందన ఇది. హైదరాబాద్‎కు చెందిన 23 ఏళ్ల కుర్రాడు రామ్‌నగేష్ అకుబతిని విరాట్ కోహ్లీ కూతురుని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. అతడు మామూలు వ్యక్తి కాదు ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉన్నత చదువు చదివిన వ్యక్తి ఇలా పోస్ట్ చేయడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది.

రామ్‌నగేష్ పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయినప్పుడు ఒక దుగుప్సకరమైన పోస్ట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురును ఇలా చేస్తాం.. అలా చేస్తామని బెదిరింపు ధోరణిలో పోస్ట్ చేశాడు. పాక్‎పై ఇండియా ఓడిపోయిందని అందరికి బాధ ఉన్నా.. ఇతడి పోస్ట్‎ను ప్రతి ఒక్కరు ఖండించారు. ఆటను ఆటగానే చూడాలని.. ఏ ఆటలోనైనా గెలుపు, ఓటమి సహజమని అంత మాత్రన దిగజారి పోస్ట్ చేయడం మంచిది కాదన్నారు. మహ్మద్ షమీపై కూడా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. పాకిస్తాన్‎పై ఇండియా ఓడిపోవడానికి షమీనే కారణమని పోస్టులు పెట్టారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేశారు. దీంతో షమీకి అందరు మద్దతుగా నిలిచారు.

చేతిలో ఫోన్ ఉంది.. అందులో చౌకగా వచ్చే నెట్‎ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. కాని ఇది ఎటు వెళ్తుందో తెలియడం లేదు. అప్పట్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన కొడుకుకు తైమూర్ అని పేరు పెట్టడం చాలా మంది సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రామ్‌నగేష్‎కు కుటుంబం ఉంది. సోదరులు, సోదరీమణులు ఉన్నారు. కానీ అతను అలా పోస్ట్ చేయడం బాధకరం. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చేయకుండా అరికట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి తప్పులు చేసేవారికి IPC సెక్షన్ 506 ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (“IT చట్టం”)లోని వివిధ నిబంధనలను సైబర్ బెదిరింపులకు పాల్పడే వారిపై పోరాడేందుకు ఉపయోగించవచ్చు.

Read Also.. India vs New Zealand: టెస్ట్ జట్టు కెప్టెన్సీ పోటీలో ఆ ఇద్దరూ.. న్యూజిలాండ్ సిరీస్‌తో తేల్చనున్న బీసీసీఐ..!