అప్పుడు తోపు.. ఇప్పుడు ఊపు.. 15 ఫోర్లు, 9 సిక్సర్లతో పెద్దపులి తుఫాన్ ఇన్నింగ్స్.. ఎవరంటే.?

ఐపీఎల్‌కి తోపు.. ఇప్పుడు ఊపు.. ఏరికోరి ఐపీఎల్‌కి తీసుకున్నారు. కట్ చేస్తే.. అమెరికాలో శివతాండవం ఆడాడు. తన జట్టుకు కావాల్సిన విజయాలను అందిస్తూ.. తన సత్తా చాటుతున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరంటే.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. లేట్ ఎందుకు ఓ లుక్కేయండి.

అప్పుడు తోపు.. ఇప్పుడు ఊపు.. 15 ఫోర్లు, 9 సిక్సర్లతో పెద్దపులి తుఫాన్ ఇన్నింగ్స్.. ఎవరంటే.?
Matthew Short

Updated on: Jun 24, 2025 | 4:59 PM

ఐపీఎల్‌లో ఎంతోమంది క్రికెటర్లు తమ సత్తాకు తగ్గ ప్రదర్శనలను కనబరిచారు. అయితే కొంతమందికి మాత్రం ఎలాంటి ఛాన్స్‌లు రాక.. కేవలం బెంచ్‌కే పరిమితమయ్యారు. ఆ కోవకు చెందిన ఓ ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ ప్లేయర్ టీ20 క్రికెట్‌కే తోపు.. విదేశీ లీగ్స్‌లో అద్భుత ప్రదర్శనలు కనబరిచాడు. దానితో ఏరికోరి ఐపీఎల్‌లో తన జట్టులో ఆడించాలని ఓ కోచ్ తెచ్చిపెట్టుకున్నాడు. అయితే టీం కూర్పు సరిపోయేసరికి.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేకపోయాడు. కట్ చేస్తే.. ఇప్పుడు పెద్దపులి మాదిరిగా గర్జించి మారీ తన జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. మరి అతడెవరో కాదు.. మ్యాథ్యూ షార్ట్.

యూఎస్ వేదికగా జరుగుతోన్న మేజర్ లీగ్ 2025 జరుగుతోంది. ఈ లీగ్‌లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టు. ఈ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు మ్యాథ్యూ షార్ట్. ఇటీవల ఎంఐ న్యూయార్క్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులతో విజయం సాధించింది శాన్‌ఫ్రాన్సిస్కో. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు కెప్టెన్ షార్ట్(91). ఓపెనింగ్‌తో బరిలోకి దిగిన షార్ట్ కేవలం 43 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. అతడికి తోడు మెక్‌గుర్క్ కూడా 64 పరుగులు చేయడంతో జట్టు భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.

కాగా, లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన న్యూయార్క్ జట్టు కేవలం 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డికాక్(70), మోనాక్ పటేల్(60) రాణించినప్పటికీ.. మరే బ్యాటర్ వాళ్లకు సహకారం అందివ్వలేదు. దీంతో ఆ జట్టు ఓటమిపాలైంది. న్యూయార్క్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలుపొందగా.. శాన్‌ఫ్రాన్సిస్కో ఐదు మ్యాచ్‌లలోనూ ఐదింట గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు మ్యాథ్యూ షార్ట్.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..