ఐపీఎల్ 2022 (IPL 2022) లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్‌ను ఓడించింది. దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ భాగస్వామ్యం రాజస్థాన్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. ఈ రోజు ఆదివారం జరగనున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో మరో బలమైన జట్టు లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు అద్భుతంమైన ఆటతీరు కనబరుస్తుండటంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తున్నారు. ఇరు జట్లు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమతూకంతో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాయి.
రాజస్థాన్ బౌలింగ్ లక్నో కంటే బలంగా కనిపిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ వంటి అద్బుత స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్ కూడా ఉన్నాడు. అదే సమయంలో బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. షిమ్రాన్ హెట్‌మెయర్ కూడా అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. లక్నో గురించి చెప్పాలంటే, క్వింటన్ డి కాక్ నుంచి కేఎల్ రాహుల్, ఆయుష్ బదోనీ వరకు అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో బలమైన ఆటతో ఆకట్టుకుంటున్నారు.
రాజస్థాన్ టీంలో ఈ ఆటగాళ్లకు అవకాశం?
రాజస్థాన్ జట్టులో అంతా బాగానే ఉంది. అయితే, ఒకే మార్పు కనిపించే అవకాశం ఉంది. రాజస్థాన్ ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో మాత్రమే ఆడుతోంది. లక్నోపై నలుగురు విదేశీ ఆటగాళ్ల కోటాను పూర్తి చేయగలదు. నవదీప్ సైనీ పెద్దగా ఆకట్టుకోలేదు. అతని స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన జిమ్మీ నీషమ్‌ను జట్టు ఆడించే ఛాన్స్ ఉంది. అతను గొప్ప బౌలర్. బోల్ట్‌కు మంచి మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రియాన్ పరాగ్‌ను కూడా బయట కూర్చోబెట్టవచ్చు. ఈ సీజన్‌లో ర్యాన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. జిమ్మీ నీషమ్‌కు అవకాశం రాకపోతే, రియాన్ పరాగ్ స్థానంలో ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ రావొచ్చు.
లక్నో జట్టులో చేరిన స్టోయినిస్..
లక్నో జట్టులో ఒక మార్పు ఆశించవచ్చు. మార్కస్ స్టోయినిస్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ, అతనిని పెవిలియన్ చేర్చేందుకు కేఎల్ రాహుల్ కసరత్తు చేయాల్సి ఉంటుంది. స్టోయినిస్ ప్లేయింగ్ XIలో చోటు సంపాదించగల ఏకైక ఆటగాడు ఎవిన్ లూయిస్ మాత్రమే. జట్టులో మరో మార్పు వచ్చే అవకాశం లేదు.
రెండు జట్లలో ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..
రాజస్థాన్ రాయల్స్ – సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్/డార్లీ మిచెల్, నవదీప్ సైనీ/జిమ్మీ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ధ్ కృష్ణ
లక్నో సూపర్ జెయింట్స్ – కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్/ఎవిన్ లూయిస్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.