IPL 2022 66వ మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోంది. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ 140, కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఐపీఎల్‌లో డి కాక్ రెండో సెంచరీ సాధించాడు. 2016లో ఆర్‌సీబీపై లీగ్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జోస్ బట్లర్ పేరిట ఉంది. ఢిల్లీపై 116 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో రాహుల్ ఈ సీజన్‌లో 500 పరుగుల మార్కును అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును కూడా డి కాక్, రాహుల్ జోడీ కలిగి ఉంది.
ఇరు జట్లు..
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), KL రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్