LPL 2024: ఇదెక్కడి అరాచకం భయ్యా.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో తుఫాన్ సెంచరీ.. అయినా, బిగ్ షాకే..

Galle Marvels vs Jaffna Kings: లంక ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్ గాలె మార్వెల్స్ వర్సెస్ జాఫ్నా కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 5 వికెట్ల తేడాతో గాలె మార్వెల్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గాలె మార్వెల్స్‌ టీమ్‌ సీఫెర్ట్‌ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జఫ్నా కేవలం 19.4 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శన (2 వికెట్లు, 35 పరుగులు)కు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు .

LPL 2024: ఇదెక్కడి అరాచకం భయ్యా.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో తుఫాన్ సెంచరీ.. అయినా, బిగ్ షాకే..
Azmatullah Omarzai, Tim Seifert

Updated on: Jul 06, 2024 | 12:00 PM

Galle Marvels vs Jaffna Kings: లంక ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్ గాలె మార్వెల్స్ వర్సెస్ జాఫ్నా కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 5 వికెట్ల తేడాతో గాలె మార్వెల్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గాలె మార్వెల్స్‌ టీమ్‌ సీఫెర్ట్‌ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జఫ్నా కేవలం 19.4 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శన (2 వికెట్లు, 35 పరుగులు)కు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు .

టిమ్ సీఫెర్ట్ అద్భుత సెంచరీ..

జాఫ్నా కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గాలె మార్వెల్స్‌కు శుభారంభం లభించలేదు. కేవలం 12 పరుగులకే నిరోషన్ డిక్వెల్లా ఔటయ్యాడు. అలెక్స్ హేల్స్ 19 బంతుల్లో 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత, ఒక ఎండ్‌లో నిలిచిన టిమ్ సీఫెర్ట్ ఒంటరిగా జట్టును భారీ స్కోరుకు తీసుకెళ్లాడు. అతను 63 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. జాఫ్నా తరపున అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జాఫ్నా కింగ్స్‌ తరపున కుశాల్‌ మెండిస్‌, రిలే రోసో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. మెండిస్ 16 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. రిలే రోస్సో 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 35 పరుగులు చేసి తన జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.

చివరి ఓవర్‌లో జాఫ్నా కింగ్స్ విజయానికి 13 పరుగులు అవసరం. ఒమర్జాయ్ తొలి 4 బంతుల్లోనే జట్టును లక్ష్యానికి చేర్చాడు. చివరి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టును సులువుగా లక్ష్యానికి చేర్చాడు. కెప్టెన్ చరిత్ అసలంక కూడా అతనికి బాగా మద్దతునిచ్చాడు. 8 బంతుల్లో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..