Lasith Malinga Retires: యార్కర్‌ కింగ్‌ రిటైర్మెంట్.. నిరుత్సాహపడుతున్న ఫ్యాన్స్

|

Sep 14, 2021 | 7:27 PM

Lasith Malinga Retires: అతడు మైదానంలో అడుగుపెడితే బ్యాట్స్‌మెన్లకు వణుకే. ఆ యార్కర్‌ బాల్స్‌ ఎక్కడ స్టంప్స్‌ని ఎగరగొడుతాయోనని దడ. వేగం, కచ్చితత్వం లైన్‌

Lasith Malinga Retires: యార్కర్‌ కింగ్‌ రిటైర్మెంట్.. నిరుత్సాహపడుతున్న ఫ్యాన్స్
Malinga
Follow us on

Lasith Malinga Retires: అతడు మైదానంలో అడుగుపెడితే బ్యాట్స్‌మెన్లకు వణుకే. ఆ యార్కర్‌ బాల్స్‌ ఎక్కడ స్టంప్స్‌ని ఎగరగొడుతాయోనని దడ. వేగం, కచ్చితత్వం లైన్‌ అండ్‌ లెన్త్‌ అతడి సొంతం. క్షణాల్లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తాగలవాడు. సడెన్‌గా క్రికెట్‌ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అతడు ఎవరో కాదు శ్రీలంక దిగ్గజ ఆటగాడు లాసిత్‌ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా పేర్కొన్నాడు.

17 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించిన తాను ఇకపై ఫీల్డ్‌లో కొనసాగాల్సిన అవసరం లేదన్నాడు మలింగా. తాను టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. గతంలోనే టెస్ట్, వన్డే ఫార్మట్ల నుంచి వైదొలిగిన మలింగా తాజాగా టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగి మొత్తంగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే తాను క్రికెట్‌ ఆడుకున్నా ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని క్రికెట్‌ కోసం బయటి నుంచి పని చేస్తానని స్పష్టం చేశాడు. 17 ఏళ్ల క్రికెట్‌ అనుభవంతో కుర్ర క్రికెటర్ల కు పాఠాలు చెబుతానని తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 30 టెస్టులు ఆడిన మలింగా 101 వికెట్లు తీశారు. 226 వన్డేలు ఆడిన ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ 338 వికెట్లు పడగొట్టాడు. 83 టీ20 మ్యాచ్‌లు ఆడిన మలింగా 107 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 166 వికెట్లు సాధించాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో 500 పైగా వికెట్లు పడగొట్టి చరిత్రలో నిలిచాడు. ఈ ఏడాది మొదట్లోనే మలింగా ముంబై ఇండియన్స్‌కు తన రిటైర్మెంట్‌పై సమాచారం ఇచ్చారు. తాను ఇకపై జట్టుకు అందుబాటులో ఉండబోనని తెలిపారు.

Seetimaarr Movie Success Meet Video: గోపీచంద్‌ హిట్ లిస్ట్‌లో మరో మూవీ.. సక్సెస్ మీట్‌తో కృతజ్ఞతలు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులు(ఫొటోస్): Shriya couple In Thirumala Photos.

Weather Report: కేంద్రీకృతంగా వాయుగుండం.. రాగల మూడు రోజుల వరకూ ఆంధ్రప్రదేశ్ వాతావరణ వివరాలు