వైభవ్ కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది.. మాజీ ఓపెనర్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ ఆటను చూసేందుకు తన భార్య కూడా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు చూస్తోందని చెప్పాడు. సరైన మార్గనిర్దేశంతో ఈ యువ బ్యాటర్ సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.

వైభవ్ కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది.. మాజీ ఓపెనర్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Krishnamachari Srikkanth Comments On Vaibhav Sooryavanshi

Updated on: Sep 05, 2026 | 12:03 PM

Vaibhav Sooryavanshi: భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. దులీప్ ట్రోఫీలో ఈ యువ బ్యాటర్ ప్రదర్శన తనను ఆకట్టుకుందని శ్రీకాంత్ పేర్కొన్నాడు. వైభవ్‌ను సరైన విధంగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో అతడు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, వైభవ్ ఆటను చూసేందుకు తన భార్య కూడా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు చూస్తోందని తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించాడు. ఎర్ర బంతి క్రికెట్‌లోనూ మీడియం పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ సిక్సర్లు బాదుతున్న తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుందని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

దులీప్ ట్రోఫీలో రికార్డు..

ఈ టోర్నీలో ఈస్ట్‌ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన వైభవ్.. క్వార్టర్‌ఫైనల్లో నార్త్‌ఈస్ట్‌ జోన్‌పై 8 పరుగులకే వెనుదిరిగాడు. అయితే సెమీఫైనల్లో సెంట్రల్‌ జోన్‌పై తన బ్యాటింగ్‌తో పుంజుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 81 బంతుల్లో 92 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు సాధించాడు.

ఎక్కువమంది చదివినది: 9 సిక్సర్లు, 10 ఫోర్లతో బుడ్డోడి అరాచకం.. దులీప్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో దులీప్ ట్రోఫీ చరిత్రలో అతి చిన్న వయసులోనే అర్ధశతకం సాధించిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సారంశ్ జైన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఈ మైలురాయిని అందుకున్నాడు. 1969లో 16 ఏళ్ల 23 రోజుల వయసులో ల‌క్ష్మణ్ సింగ్ నెలకొల్పిన రికార్డును వైభవ్ అధిగమించాడు.

చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు..

వైభవ్ ఇప్పటికే ఐపీఎల్‌, అంతర్జాతీయ, అండర్‌-19 క్రికెట్‌లో పలు రికార్డులు సాధించాడు. 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో రాణించడంతో పాటు, అంతర్జాతీయ టీ20లోనూ చిన్న వయసులో అర్ధశతకం సాధించిన ఘనత అందుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: Vaibhav Sooryavanshi: ఫైనల్ మ్యాచ్ ఆడొద్దు.. వైభవ్ సూర్యవంశీకి షాకిచ్చిన గంభీర్..?

దులీప్ ట్రోఫీ 2026-27లో ఈస్ట్‌ జోన్‌కు వైభవ్ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్, అభిమన్యు ఈశ్వరన్, మహ్మద్ షమి, ముకేశ్ కుమార్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us