KKR vs RCB Match Highlights, IPL 2021: కోహ్లీ సేన ఘోర పరాజయం.. 9 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం

|

Sep 20, 2021 | 10:32 PM

KKR vs RCB Match Highlights in Telugu: ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు రెండో రోజు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. కోహ్లీ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

KKR vs RCB Match Highlights, IPL 2021: కోహ్లీ సేన ఘోర పరాజయం.. 9 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం
Kkr Vs Rcb, Ipl 2021
Follow us on

KKR vs RCB Match Highlights, IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా ఈరోజు రెండవ మ్యాచ్‌లో కేకేఆర్ టీం, ఆర్‌సీబీ టీంలు తలపడ్డాయి. ఈ సీజన్‌లో ఇది 31 వ మ్యాచ్. ఇందులో కేకేఆర్ టీం 9 వికెట్ల తేడాతో కోహ్లీసేనను ఓడించింది. ఆర్‌సీబీ విధించిన 93 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ టీం కేవలం  10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి సాధించారు. కేకేఆర్ విజయంలో బ్యాట్స్‌మెన్స్ గిల్ (48), వెంకటేష్ అయ్యర్ (41 నాటౌట్), వరుణ్ చక్రవర్తి(3 వికెట్లు), ఆండ్రీ రస్సెల్(3 వికెట్లు) కీలక పాత్ర పోషించారు.

9 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 48, వెంకటేష్ అయ్యర్ 29 పరుగులతో ఉన్నారు. బౌండరీలతో ఆర్‌సీబీ బౌలర్లకు ఈ జోడీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటి వరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు కేకేఆర్ ఇన్నింగ్స్‌లో వచ్చాయి.

6 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 30, వెంకటేష్ అయ్యర్ 22 పరుగులతో ఉన్నారు. బౌండరీలతో ఆర్‌సీబీ బౌలర్లకు ఈ జోడీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటి వరకు 8 ఫోర్లు, 1 సిక్స్ కేకేఆర్ ఇన్నింగ్స్‌లో వచ్చాయి.

4 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 10, వెంకటేష్ అయ్యర్ 16 పరుగులతో ఉన్నారు.

2 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ 8, వెంకటేష్ అయ్యర్ 9 పరుగులతో ఉన్నారు.

కోహ్లీ సేన వరుసగా వికెట్లు కోల్పోతూ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాట్స్‌మెన్స్ పరుగులు సాధించలేక పెవిలియన్ చేరారు. వికెట్ల పతనానికి ఆర్‌సీబీ కెప్టెన్ దారితీశాడు. తొలి వికెట్‌గా వెనుదిరిగిన కోహ్లీ(5), ఆతరువాత ఏ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేక కేకేఆర్ బౌలర్లకు వికెట్లను సమర్పించుకున్నారు.

పడిక్కల్ (22) పరుగులతో ఒక్కడే అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భరత్ 16, మ్యాక్స్‌వెల్ 10, ఏబీడీ 0, సచిన్ బేబీ 7, హసరంగా 0, జైమిసన్ 4, హర్షల్ పటేల్ 12, సిరాజ్ 8, చాహల్ 2 నాటౌట్‌గా నిలిచారు.

కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3, వరుణ్ చక్రవర్తి 3, ఫెర్గ్యూసన్ 2, ప్రసీద్ధ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు రెండో రోజు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే భారత్‌లో జరిగిన తొలి దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లాడి రెండు విజయాలు సాధించిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ ఆశలు నిలవాలంటే మాత్రం ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు కోహ్లీ సేన చాలా బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పోరు కేకేఆర్‌కు చాలా కీలకం కానుంది.

ఈ రెండు జట్లు ఆదివారం 27 వ సారి లీగ్‌లో తలపడతాయి. గణాంకాల పరంగా కేకేఆర్ ఆధిక్యంలో ఉంది. కేకేఆర్ 27 మ్యాచ్‌లలో 14 గెలిచింది. ఆర్‌సీబీ ఖాతాలో కేవలం 13 విజయాలు మాత్రమే ఉన్నాయి. చివరిసారిగా రెండు జట్లు ఏప్రిల్ 18 న ఒకదానికొకటి తలపడ్డాయి. ఆర్‌సీబీ 38 పరుగుల తేడాతో కేకేఆర్‌టీంను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ 49 బంతుల్లో 78 పరుగులు చేయగా, ఏబీ డివిలియర్స్ 34 బంతుల్లో 76 పరుగులు చేశాడు. బెంగళూరు 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈ లక్ష్యం చాలా పెద్దది. జట్టులోని బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. కేకేఆర్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.