Suresh Raina Retirement: సురేశ్ రైనా హఠాత్తుగా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు.. అసలు కారణం ఇదే..

|

Sep 06, 2022 | 4:35 PM

IPL 2023: సురేశ్ రైనా 15 ఆగస్టు 2020న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అయితే అతను దేశీయ క్రికెట్, IPLలో చురుకుగా ఉన్నాడు.

Suresh Raina Retirement: సురేశ్ రైనా హఠాత్తుగా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు.. అసలు కారణం ఇదే..
Suresh Raina Retirement
Follow us on

2011 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో భాగమైన సురేశ్ రైనా మంగళవారం అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైరయ్యాడు. ఈ నిర్ణయంతో అతను ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), దేశవాళీ క్రికెట్‌లో ఆడటం లేదని అర్థం. అతను తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, గత సంవత్సరం IPL లో కనిపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున చాలా ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడిన ఈ ఆటగాడిని ఈ ఫ్రాంచైజీ రిటైన్ చేయలేదు లేదా కొనుగోలు చేయలేదు.

చెన్నైతో రైనా నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. రైనా ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. అతను మొత్తం 205 మ్యాచ్‌లు ఆడాడు. అతను 32.52 సగటుతో 5538 పరుగులు చేయగలిగాడు. ఐపీఎల్‌లో 39 హాఫ్ సెంచరీలు అతని పేరిట ఉండగా ఒక సెంచరీ కూడా ఉంది. ఒకప్పుడు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతను ఐదో స్థానంలో ఉన్నాడు. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రైనా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.

  1. ఐపీఎల్-2022లో రైనాకు కొనుగోలుదారు లభించలేదు. అతనిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేయలేదు. తర్వాత ఏ ఇతర ఫ్రాంచైజీ కూడా అతనిని కొనుగోలు చేయలేదు. ఈసారి కూడా రైనాపై ఏ ఫ్రాంచైజీ పందెం కాస్తుందని భావించడంలేదు.
  2. భారత క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న రైనా విదేశీ లీగ్‌లలో ఆడలేడు. తమ ఆటగాళ్లు రిటైర్ అయ్యే వరకు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. రైనా విదేశీ లీగ్‌లలో ఆడాలని భావించాడు. అందుకే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు.
  3. సొంత రాష్ట్రంలో కూడా ఎంతో మంది ప్రతిభావంతులు బయటకు వస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, అతను తన రాష్ట్ర జట్టులో కూడా చోటు సంపాదించడం కష్టంగా ఉంది. అతను రిటైర్ కావడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
  4. రైనా చివరిసారిగా 2021లో ఐపీఎల్ ఆడాడు. కానీ, అతను పెద్దగా రాణించలేకపోయాడు. అతను మొత్తం మ్యాచ్ కూడా ఆడలేదు. అతని ఫాం కూడా ప్రస్తుతం ఆశించినంతగా లేదు.