Watch Video: షారుక్ ఔటవ్వగానే చిందులేసిన సుహానా ఖాన్, అనన్య పాండే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

IPL 2022, KKR vs PBKS: కోల్‌కతా వర్సెస్ పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్‌ని చూసేందుకు సుహానా ఖాన్, అనన్య పాండే వాంఖడేకి వచ్చారు. పంజాబ్ కింగ్స్ హిట్టర్ షారుక్ ఖాన్ ఔటవ్వగానే, వీరిద్దరూ తెగ సంబరపడిపోయారు.

Watch Video: షారుక్ ఔటవ్వగానే చిందులేసిన సుహానా ఖాన్, అనన్య పాండే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Ipl 2022 Shahrukh Khan Ananya Panday Suhana Khan

Updated on: Apr 01, 2022 | 9:42 PM

KKR vs PBKS: IPL 2022 ఎనిమిదో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ముంబైలోని వాంఖడేలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు పంజాబ్ బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించారు. అదే సమయంలో, KKRకి మద్దతుగా సుహానా ఖాన్, కింగ్ ఖాన్ కుమార్తె అనన్య పాండే కూడా వాంఖడే చేరుకున్నారు. ఇంతలో, పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్ షారుక్ ఖాన్ అవుట్ అయ్యాడు. అయితే, సుహానా ఖాన్, అనన్య పాండే ఇద్దరూ సంతోషంగా కనిపించారు. చప్పట్లు కొడుతూ, ఎగురుతూ సందడి చేశారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 18.2 ఓవర్లలో 137కే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ దిగ్గజాలందరూ ఫ్లాప్ అయ్యారు. షారుక్ ఖాన్ గురించి మాట్లాడతే, అతను ఐదు బంతులు ఆడి, సున్నాకి ఔట్ అయ్యాడు. అతడిని టిమ్ సౌథీ క్యాచ్ అవుట్ చేశాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుకా రాజపక్సే (కీపర్), షారూఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్.

Also Read: KKR vs PBKS: 4వికెట్లతో సత్తా చాటిన ఉమేష్ యాదవ్.. తక్కువ స్కోర్‌కే పంజాబ్ ఆలౌట్.. కోల్‌కతా టార్గెట్ 138..

9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు.. 340పైగా స్ట్రైక్‌రేట్.. కేకేఆర్ బౌలర్ల పాలిట పీడకలగా మారిన పంజాబ్ బ్యాటర్..