KKR vs DC Highlights, IPL 2022: ఢిల్లీ డాషింగ్ విన్.. 44 పరుగుల తేడాతో ఓడిన కోల్‌కతా

|

Apr 10, 2022 | 7:37 PM

KKR vs DC Highlights in Telugu: ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ముందు 216 పరగుల టార్గెట్‌ను ఉంచింది.

KKR vs DC Highlights, IPL 2022: ఢిల్లీ డాషింగ్ విన్.. 44 పరుగుల తేడాతో ఓడిన కోల్‌కతా
Kkr Vs Dc Live Score, Ipl 2022

Kolkata Knight Riders vs Delhi Capitals Highlights in Telugu: ఐపీఎల్‌లో ఈరోజు డబుల్ హెడర్ డే. తొలి మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. 216 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అది కూడా టాస్ ఓడి బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. కోల్‌కతా తరపున సారథి శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, ఖలీల్ అహ్మద్ 3, లలిత్ యాదవ్ ఒక వికెట్, శార్దుల్ 2 వికెట్లు దక్కించుకున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి

Key Events

పాయింట్ల పట్టికలో జట్ల పరిస్థితి ఏమిటి?

4 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా మూడు విజయాలు, 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ 3 మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయి 7వ స్థానంలో ఉంది.

ఆధిపత్యం ఎవరిది?

ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 28 మ్యాచ్‌లు జరగగా, 16 మ్యాచ్‌ల్లో కోల్‌కతా, 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందాయి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 Apr 2022 07:36 PM (IST)

    ఢిల్లీ డాషింగ్ విన్

    216 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

  • 10 Apr 2022 07:19 PM (IST)

    17 ఓవర్లకు కోల్‌కతా స్కోర్..

    17 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. క్రీజులో రస్సెల్ 10, సలాం 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి 17 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది.

  • 10 Apr 2022 07:15 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కోల్‌కతా టీం 8వ వికెట్‌ను కూడా కోల్పోయింది. దీంతో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. ఉమేష్ యాదవ్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ 143 పరుగుల వద్ద 8వ వికెట్‌ను కోల్పోయింది.

  • 10 Apr 2022 07:12 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కోల్‌కతా టీం ఏడో వికెట్‌ను కూడా కోల్పోయింది. డేంజరస్ బ్యాట్స్‌మెన్ సునీల్ నరైన్ (4) పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ 143 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది

  • 10 Apr 2022 07:10 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కోల్‌కతా టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. డేంజరస్ బ్యాట్స్‌మెన్ పాట్ కమిన్స్‌ను (4) పెవిలియన్ చేర్చాడు. దీంతో కేకేఆర్ 139 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది.

  • 10 Apr 2022 06:58 PM (IST)

    14 ఓవర్లకు కోల్‌కతా స్కోర్..

    14 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. క్రీజులో శామ్ బిల్లింగ్స్ 14, రస్సెల్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Apr 2022 06:52 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కోల్‌కతా టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దూకుడుగా ఆడి, హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ 54 (33 బంతులు, 2 సిక్సులు, 5 ఫోర్లు) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ 117 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

  • 10 Apr 2022 06:45 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    లలిత్ యాదవ్ బౌలింగ్‌లో కోల్‌కతా టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న నితీష్ రాణా 30 (20 బంతులు, 3 సిక్సులు) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ 107 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 10 Apr 2022 06:39 PM (IST)

    11 ఓవర్లకు కోల్‌కతా స్కోర్..

    11 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 46, నితీష్ రాణా 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి 38 బంతుల్లో 63 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు.

  • 10 Apr 2022 06:27 PM (IST)

    9 ఓవర్లకు కోల్‌కతా స్కోర్..

    9 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం 2 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 32, నితీష్ రాణా 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి 26 బంతుల్లో 36 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు.

  • 10 Apr 2022 06:07 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కోల్‌కతా టీం రెండో వికెట్‌ను కూడా కోల్పోయింది. ఆది నుంచి ఇబ్బందులు పడుతోన్న అజింక్యా రహానే 8 (14 బంతులు, 1 ఫోర్) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శార్దుల్ అద్భుత క్యాచ్‌తో ఔటయ్యాడు. దీంతో కేకేఆర్ 38 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 10 Apr 2022 05:55 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కోల్‌కతా టీం తొలి వికెట్‌ను కోల్పయింది. బౌండరీలతో దూకుడుగా ఆడుతోన్న వెంకటేష్ అయ్యర్18(8 బంతులు, 1ఫోర్, 2 సిక్సులు) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ 21 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 10 Apr 2022 05:25 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం టార్గెట్ 216

    ఐపీఎల్‌లో ఈరోజు డబుల్ హెడర్ డే. తొలి మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. దీంతో టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ముందు 216 పరగుల టార్గెట్‌ను ఉంచింది. 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

  • 10 Apr 2022 05:05 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..

    డేవిడ్ వార్నర్ (61 పరుగులు, 45 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రూపంలో ఢిల్లీ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 166 పరుగుల వద్ద ఢిల్లీ టీం తరపున ఐదో వికెట్‌ పడింది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఢిల్లీ భారీ స్కోర్ చేయలేక ఇబ్బందులు పడుతోంది.

  • 10 Apr 2022 05:01 PM (IST)

    16 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    16 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 60 (42 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Apr 2022 04:47 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..

    లలిత్ యాదవ్(1) రూపంలో ఢిల్లీ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 151 పరుగుల వద్ద ఢిల్లీ టీం తరపున మూడో వికెట్‌ పడింది. డేవిడ్ వార్నర్ 58 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 10 Apr 2022 04:41 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..

    తుఫాన్ బ్యాటింగ్‌తో కేవలం 14 బంతుల్లోనే 27(2 ఫోర్లు, 2 సిక్సులు) బాదిన ఢిల్లీ సారథి రిషబ్ పంత్‌ను… రస్సెల్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 148 పరుగుల వద్ద ఢిల్లీ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 10 Apr 2022 04:38 PM (IST)

    డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ..

    డేవిడ్ వార్నర్ 55 (34 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో తన 51వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ తరపున ఈ మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీ నమోదైంది.

  • 10 Apr 2022 04:35 PM (IST)

    12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    12 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 1 వికెట్ కోల్పోయి 137 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 47 (33 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ 25 (12 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు కేవలం 22 బంతుల్లోనే 43 పరుగులు భాగస్వామ్యంతో మరో కీలక భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు. ఇప్పటి వరకు రన్ రేట్ మాత్రం ఏ దశలోనూ 11కు తగ్గకుండా చూసుకుంటున్నారు.

  • 10 Apr 2022 04:24 PM (IST)

    10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 1 వికెట్ కోల్పోయి 101 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 38(26 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ 6(5 బంతులు, 1 ఫోర్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Apr 2022 04:18 PM (IST)

    పృథ్వీ షా ఔట్..

    తుఫాన్ బ్యాటింగ్‌తో కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పృథ్వీ షా… వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఢిల్లీ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. దీంతో 93 పరుగుల ఓపెనర్ల భాగస్వామ్యానికి బ్రేకులు వేసింది.

  • 10 Apr 2022 04:15 PM (IST)

    పృథ్వీ షా హాష్ సెంచరీ

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 87 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్‌లు కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో షా కేవలం 27 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. డేవిడ్ వార్నర్‌తో కలిసి కేవలం 48 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీ స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టిస్తున్నారు.

  • 10 Apr 2022 04:13 PM (IST)

    8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 87 పరుగులు చేసింది. పృథ్వీ షా 50(27 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్స్), డేవిడ్ వార్నర్ 32(21 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి కేవలం 48 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు.

  • 10 Apr 2022 04:02 PM (IST)

    6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    6 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 68 పరుగులు చేసింది. పృథ్వీ షా 36(20 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ 27(16 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి కేవలం 36 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు.

  • 10 Apr 2022 03:52 PM (IST)

    4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 50 పరుగులు చేసింది. పృథ్వీ షా 30(16 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ 15(8 బంతులు, 3 ఫోర్లు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి కేవలం 24 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యంతో దూసుకపోతున్నారు.

  • 10 Apr 2022 03:41 PM (IST)

    2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    2 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం 20 పరుగులు చేసింది. పృథ్వీ షా 15, డేవిడ్ వార్నర్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Apr 2022 03:39 PM (IST)

    పృథ్వీ షా vs కోల్‌కతా

    Prithvi Shaw vs KKR:

    62

    99

    14

    66

    82

    18

    సగటు 56.83 | స్ట్రైక్ రేట్ 170.50 | నాలుగు అర్థసెంచరీలు

  • 10 Apr 2022 03:18 PM (IST)

    పంత్ vs శ్రేయాస్ అయ్యర్:

    పంత్ వర్సెస్ అయ్యర్ ఇద్దరూ భారత జట్టు భవిష్యత్తు కెప్టెన్లుగా పేరుగాంచారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ ఎలా రాణిస్తారనేది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తన జట్టు ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచినందున కొంత ఒత్తిడిని అనుభవించక తప్పదు.

  • 10 Apr 2022 03:08 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు..

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి.

    కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

  • 10 Apr 2022 03:06 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు..

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

    ఢిల్లీ జట్టులో ఒక మార్పు జరిగింది. నోర్ట్జేను తప్పించి, ఖలీల్ ఎంట్రీ ఇచ్చాడు.

  • 10 Apr 2022 03:05 PM (IST)

    టాస్ గెలిచిన కోల్‌కతా..

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

Follow us on