ఐపీఎల్ 2022లో భాగంగా మంబైలోని వాఖండే స్డేడియంలో కోల్‌కత్త నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 146 పరుగులు చేసింది. ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, కోల్‌కతా జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది.
ఢిల్లీ జట్టు కొత్త జెర్సీని ధరించి ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టనుంది. ఆ తర్వాత జెర్నీని వేలం వేస్తారు.
కోల్‌కత్తాపై ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. అక్సర్ పటేల్ రనౌట్ అయ్యాడు.
ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. లలిత్ యాదవ్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. డెవిడ్ వార్నర్ ఔటయ్యాడు.
ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. మిచల్ మార్ష్ క్యాచ్ ఔటయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. పృథ్వీషా కాటన్ బౌల్డ్ అయ్యాడు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
కోల్‌కత్తా 9వ వికెట్ కోల్పోయింది.
కోల్‌కత్తా 8వ వికెట్ కోల్పోయింది. నితిష్ రాణా క్యాచ్ ఔటయ్యాడు.
కోల్‌కత్తా ఏడో వికెట్ కోల్పోయింది. రింక్ సింగ్ క్యాచ్ ఔటయ్యాడు.
కోల్‌కత్తా ఆటగాడు నితిష్ రాణా హాఫ్ సెంచరీ చేశాడు. 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
కోల్‌కత్తా ఆరో వికెట్ కోల్పోయింది. అండ్రు రసెల్ స్టాంప్ ఔటయ్యాడు.
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల విజృంభిస్తున్నారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. కోల్‌కతా టీమ్ తాజాగా 4 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జట్టు స్కోరు 51/4.
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. అక్సర్ పటేల్ బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యరు క్యాచ్ ఔటయ్యాడు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. అరోన్ ఫించ్ బౌల్డ్ అయ్యాడు.