Kevin Pietersen: భారత్‌పై ఇంగ్లాండ్ ఆటగాడి ప్రశంసలు… సహృదయత కలిగిన వారు భారతీయులని కితాబు…

| Edited By:

Feb 03, 2021 | 2:29 PM

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. భారతీయుల ఉదారతను...

Kevin Pietersen: భారత్‌పై ఇంగ్లాండ్ ఆటగాడి ప్రశంసలు... సహృదయత కలిగిన వారు భారతీయులని కితాబు...
Follow us on

Vaccines To South Africa: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. భారతీయుల ఉదారతను కొనియాడాడు. దేశ ప్రజల సహృదయతను కీర్తించాడు. ఇండియాపై తన అభిప్రాయాలను ఈ క్రికెటర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీనికి కారణం ఏంటంటే… దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు భారత టీకాలు చేరాయని సోమవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీటర్సన్‌ పై అభిప్రాయలను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాకు భారత్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్లను పంపించింది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతేగాక కొత్త రకం వైరస్‌ కూడా వ్యాప్తి చెందుతోంది. షెడ్యూలు ప్రకారం వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్‌ మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. కరోనా భయంతో దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా జట్టు వాయిదా వేసుకుంది. ఇంగ్లాండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20లు ఆడిన పీటర్సన్‌ దక్షిణాఫ్రికాలో జన్మించిన విషయం తెలిసిందే. తాను పుట్టిన దేశానికి భారత్ కరోనా వ్యాక్సిన్ అందజేతపై పీటర్సన్ ఆనందం వ్యక్తం చేశాడు.

 

Also Read: INDIA VS ENGLAND: ఇంగ్లండ్‌ను తిప్పేద్దాం… ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా…