కేన్ విలియమ్సన్‌కు మినీ వేలంలో చుక్కెదురు అయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఈ కివీస్ కెప్టెన్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఎటువంటి పోటీ లేకుండానే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్(రూ. 2 కోట్లు)ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో కేన్ విలియమ్సన్‌కు అపారమైన అనుభవం ఉందని చెప్పొచ్చు. డేవిడ్ వార్నర్ హైదరాబాద్ కెప్టెన్‌గా తప్పుకున్న అనంతరం 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ సారధ్య బాధ్యతలు తీసుకున్న కేన్ మామ.. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా ఆ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు.
అయితే అనూహ్యంగా ఈ ఏడాది టోర్నమెంట్‌లో విలియమ్సన్ పెద్దగా రాణించలేకపోయాడు. అటు హైదరాబాద్ జట్టు కూడా టీంగా ఘోర వైఫల్యం చెందటంతో.. వేలానికి ముందుగా విలియమ్సన్‌ను ఆ ఫ్రాంచైజీ వదిలేసింది. అందరూ కూడా మినీ వేలంలో విలియమ్సన్ ఎక్కువ ధరకే అమ్ముడుపోతాడని భావించారు. ఆక్షన్‌లో మొదటి పేరు కేన్‌ది కావడం విశేషం. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అతడిపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో.. పోటీ లేకుండానే గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్(రూ. 2 కోట్లు)ను గెలుచుకుంది.
కాగా, ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 76 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 126 స్ట్రైక్ రేటుతో 2101 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2015 సీజన్‌లో సన్‌రైజర్స్ బెంగళూరు కేన్ విలియమ్సన్‌ను దక్కించుకోగా.. అదే జట్టుకు 2018లో టాప్ రన్‌గెట్టర్(735)గా నిలిచాడు. అలాగే వార్నర్‌తో కలిసి 2016-20 వరకు హైదరాబాద్‌కు టాప్ ఆర్డర్‌లో పరుగుల వరద పారించాడు.
We begin with a bang! ?
KANE chho, Williamson bhai? Welcome to GT! #TATAIPL | #AavaDe | #IPLAuction
— Gujarat Titans (@gujarat_titans) December 23, 2022