Kagiso Rabada: టెస్ట్ క్రికెట్‌లో రబడా వరల్డ్ రికార్డు.. పాక్ దిగ్గజ ఫేసర్‌ను వెనక్కి నెట్టి..

టెస్ట్ క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఫేసర్ రబడా మరో ఘనత సాధించాడు. అతి తక్కువ బంతుల్లో వేగంగా 300 టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాక్ దిగ్గజ ఫేసర్ వకార్ యూనిస్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట తిరగరాశాడు రబడా..

Kagiso Rabada: టెస్ట్ క్రికెట్‌లో రబడా వరల్డ్ రికార్డు.. పాక్ దిగ్గజ ఫేసర్‌ను వెనక్కి నెట్టి..
South Africa Bowler Kagiso Rabada (File Photo)
Image Credit source: PTI

Updated on: Oct 21, 2024 | 5:38 PM

దక్షిణాఫ్రికా స్టార్ ఫేసర్ కగిసో రబడా టెస్ట్ క్రికెట్ చిత్రలో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరిన ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్.. బంతుల పరంగా అతి వేగంగా ఈ ఘనతను సాధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్‌లో 11,817 బంతుల్లో రబడా 300 వికెట్లు సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్థాన్ మాజీ ఫేసర్ వకార్ యూనిస్ పేరిట ఈ ప్రపంచ రికార్డ్ ఉంది. పాక్ దిగ్గజ ఫేసర్ వకార్ యూనిస్ 12,602 బంతుల్లో 300 టెస్ట్ వికెట్లు సాధించాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకా స్టేడియంలో జరిగిన జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో రబడా సోమవారంనాడు (అక్టోబర్ 21) ఈ రికార్డును తన పేరిట తిరగరాశాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్ 12,605 బంతుల్లో 300 టెస్ట్ వికెట్లు సాధించగా.. ఆ దేశానికి చెందిన మరో దిగ్గజ ఫేసర్ అలన్ డొనాల్డ్ 13,672 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌కు చెందిన మార్షల్ 13,728 బంతుల్లో 300 టెస్ట్ వికెట్ల క్లబ్‌లో చేరాడు.

టెస్ట్‌లో రబడా 300వ వికెట్ సాధించిన క్షణం..

వేగంగా 300 టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్లు..

1. 11,817 బంతులు – కగిసో రబడా (దక్షిణాఫ్రికా)

2. 12,602 – వకార్ యూనిస్ (పాకిస్థాన్)

3. 12,605 – డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)

4. 13,672 – అలన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా)

5. 13,728 – మాల్కోమ్ మార్షల్ (వెస్టిండీస్)

అలాగే సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఆరో బౌలర్ గా రబడా రికార్డుల్లోకెక్కాడు. ముష్ఫికర్ రహీమ్ ను ఔట్ చేయడం ద్వారా 300 వికెట్ల క్లబ్‌లో చేరిన రబడా.. ఆ తర్వాత లిటన్ దాస్ వికెట్‌తో తన వికెట్ల సంఖ్యను 301కు పెంచుకున్నాడు. 2015లో భారత్‌పై తొలి మ్యాచ్‌తో రబడా టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ద.ఆఫ్రికా బౌలర్లు వీరే..

439 వికెట్లు – డేల్ స్టెయిన్ (93 Tests)

421 – షాన్ పొలాక్ (108 Tests)

390 – మఖాయ ఎంతిని (101 Tests)

330 – అలన్ డొనాల్డ్ (72 Tests)

309 – మోర్న్ మోర్కల్ (86 Tests)

301 – కగిసో రబడా (65 Tests)*