Cricket: వరుసగా 7 టెస్టుల్లో కెప్టెన్‌గా ఫెయిల్.. కట్ చేస్తే.. 32 శతకాల బ్యాటర్ కెరీర్ ఖతం.. ఎవరంటే?

|

Jan 09, 2023 | 1:14 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో విజయం అంత తేలికగా రాదు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు అయితే మాత్రం.. తమకు మంచి గుర్తింపు రావాలంటే చాలా ఏళ్లు కష్టపడాల్సిందే.

Cricket: వరుసగా 7 టెస్టుల్లో కెప్టెన్‌గా ఫెయిల్..  కట్ చేస్తే.. 32 శతకాల బ్యాటర్ కెరీర్ ఖతం.. ఎవరంటే?
Cricket1
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌లో విజయం అంత తేలికగా రాదు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు అయితే మాత్రం.. తమకు మంచి గుర్తింపు రావాలంటే చాలా ఏళ్లు కష్టపడాల్సిందే. మరి ఓ బ్యాంగ్‌తో ప్రారంభమై.. ఠక్కున కెరీర్‌లు ఖతం చేసుకున్న క్రికెటర్లు కూడా కొందరు ఉన్నారు. వారిలో ఒకరు వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ జిమ్మీ ఆడమ్స్. ఈ రోజు ఆయన పుట్టినరోజు.

జిమ్మీ గణాంకాలను ప్రస్తుతం పరిశీలిస్తే.. ఆడమ్స్ తన అంతర్జాతీయ కెరీర్‌ను 1992లో ప్రారంభించి.. అరంగేట్రంలో అద్భుతంగా రాణించాడు. ఆడిన మొదటి 5 టెస్టుల్లో 3 అర్ధ సెంచరీలు, ఇంగ్లాండ్‌పై ఆడిన 6వ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత భారత పర్యటనలో వరుసగా రెండు సెంచరీలతో పాటు తదుపరి 8 టెస్టుల్లో అత్యధిక పరుగులు నమోదు చేశాడు. మొత్తంమీద, మొదటి 14 టెస్టుల్లో, అతను 88 కంటే ఎక్కువ సగటుతో 1300 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

కట్ చేస్తే.. అతడి ప్రదర్శన క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. తొలి 14 టెస్టుల్లో 4 సెంచరీలు చేసిన ఆడమ్స్ తర్వాత 40 టెస్టుల్లో 2 సెంచరీలు మాత్రమే చేశాడు. 2001లో చివరి టెస్టు ఆడే సమయానికి జిమ్మీ ఆడమ్స్ 41 సగటు మాత్రమే. ఇలా మొత్తం మీద ఆడమ్స్ టెస్టుల్లో 3102 పరుగులు సాధించగా, 127 వన్డేల్లో 28 సగటుతో 2204 పరుగులు చేశాడు. ఒక్క బ్యాటింగ్ మాత్రమే కాదు, కెప్టెన్సీలో కూడా అతడి గ్రాఫ్ రేటు సోసోగానే ఉంది. 2000లో వెస్టిండిస్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన జిమ్మీ.. మొదటి 6 మ్యాచ్‌లలో 4 గెలిచి, రెండు డ్రాగా ముగించాడు. తర్వాత 8 మ్యాచ్‌ల్లో వరుసగా ఏడింటిలో సారధిగా ఫెయిల్ అయ్యాడు. ఇక అదే అతడి కెరీర్‌ను కూడా క్లోజ్ చేసింది.