
Jaydev Unadkat T20 Record: టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటాడు. సాధారణంగా బంతితో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ఈ సౌరాష్ట్ర కెప్టెన్.. ఇప్పుడు బ్యాట్‌తో అరుదైన రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, చేతన్ సకారియాతో కలిసి పదో వికెట్‌కు అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో గురువారం సౌరాష్ట్ర, తమిళనాడు జట్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 193 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో సౌరాష్ట్రకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 54/2తో ఉన్న జట్టు.. వరుసగా వికెట్లు కోల్పోయి 92 పరుగులకే 9 వికెట్లు నష్టపోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా అద్భుతంగా పోరాడారు.
ఎక్కువమంది చదివినది: SL A vs IND A: ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్ వర్మ
ముఖ్యంగా సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కట్ 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బెల్జియం ఆటగాడు ఖలీద్ అహ్మదీ పేరిట ఉండేది. అతను 2021లో మాల్టాపై 18 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పుడు ఉనద్కట్ 40 పరుగులతో ఆ రికార్డును అధిగమించాడు.
| పరుగులు | ఆటగాడు | ప్రత్యర్థి |
|---|---|---|
| 40 (26) | జయదేవ్ ఉనద్కట్ | తమిళనాడు (2026) |
| 31* (18) | ఖలీద్ అహ్మదీ | మాల్టా (2021) |
| 23 (14) | పాల్ వాన్ మీకెరెన్ | బంగ్లాదేశ్ (2022) |
ఉనద్కట్, చేతన్ సకారియా కేవలం వ్యక్తిగత రికార్డులకే పరిమితం కాలేదు. వీరిద్దరూ కలిసి పదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20 క్రికెట్ చరిత్రలో పదో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యాల్లో ఇది సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.
2021లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో పనామా ఆటగాళ్లు ఖేంగర్ అహిర్, నికుంజ్ అహిర్ కూడా పదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఉనద్కట్, సకారియా ఈ రికార్డును సమం చేశారు.
| పరుగులు | ఆటగాళ్లు | జట్లు |
|---|---|---|
| 62 | ఉనద్కట్ – సకారియా | సౌరాష్ట్ర |
| 62* | ఖేంగర్ అహిర్ – నికుంజ్ అహిర్ | పనామా |
| 55* | సుధాకర్ కొప్పోలు – దిలీప్ పల్లెకొండ | స్లోవేనియా |
ఈ మ్యాచ్‌లో ఉనద్కట్, సకారియా బౌలింగ్‌లోనూ రాణించారు. ఉనద్కట్ నాలుగు ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టగా.. చేతన్ సకారియా నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. సౌరాష్ట్ర తరపున సకారియా అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
ఎక్కువమంది చదివినది: నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో .. బ్యాటర్‌గా, నాయకుడిగా అట్టర్ ఫ్లాప్.. తిలక్ వర్మపై ఫ్యాన్స్ ఫైర్..!
మరోవైపు ఐపీఎల్ 2027 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు జయదేవ్ ఉనద్కట్‌ను విడుదల చేసింది. దీంతో ఉనద్కట్‌తో పాటు చేతన్ సకారియా కూడా వచ్చే ఐపీఎల్ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఇద్దరు పేసర్లు చూపించిన ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..