Jasprit Bumrah : ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్‎ను పోయించిన బూమ్రా..దెబ్బకు బ్యాట్ వదిలి..

లార్డ్స్ టెస్ట్ మూడో రోజున జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్, రిషబ్ పంత్ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుమ్రా వేసిన ఒక భయంకరమైన బంతి క్రాలీని వణికించింది, పంత్ తన మాటలతో బెన్ డకెట్‌కు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. పంత్ ఇచ్చిన ఆన్సర్, కేవలం ఒక మాట మాత్రమే కాదు, అది ప్రత్యర్థిపై ఒక మానసిక విజయం.

Jasprit Bumrah : ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్‎ను పోయించిన బూమ్రా..దెబ్బకు బ్యాట్ వదిలి..
Zak Crawley

Updated on: Jul 13, 2025 | 6:34 PM

Jasprit Bumrah : ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒక భయంకరమైన బంతి జైక్ క్రాలీని షేక్ చేసింది. ఆ బంతి క్రాలీ చేతికి బలంగా తగిలింది. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. బుమ్రా వేసిన ఆ బంతి పిచ్‌పై పైకి లేచి, వేగంగా దూసుకొచ్చింది. ముందుకు వెళ్లి ఆడడానికి ప్రయత్నించిన క్రాలీకి ఆ బంతి ఊహించని షాక్ ఇచ్చింది. అది నేరుగా అతని గ్లౌవ్స్‌కు బలంగా తగిలి, గాల్లోకి ఎగిరింది. అయితే, సిల్లీ మిడ్-ఆన్‌లో ఫీల్డర్ లేకపోవడంతో, బుమ్రా ఆ అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు పరుగెత్తి, డైవ్ చేసి ఆ క్యాచ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే, ఆ బంతి బుమ్రా చేతి వేళ్లకు కొద్దిగా తగిలి కింద పడింది. దీంతో భారత ఫీల్డర్లు ఆందోళన చెందారు. ఆ దెబ్బకు క్రాలీ వెంటనే తన గ్లౌవ్స్‌ను తీసి బాధతో నొప్పితో తన చేతులను ఊపుకుంటూ కనిపించాడు. ఈ సంఘటన బుమ్రా బౌలింగ్‌ ఎలా ఉంటుందో మరోసారి గుర్తు చేసింది. ఈసారి వికెట్ పడకపోయినా బుమ్రా దాడి ఎలా ఉంటుందో క్రాలీకి తెలిసింది. లార్డ్స్ టెస్ట్ మూడో రోజు కేవలం అద్భుతమైన క్రికెట్ మాత్రమే కాదు, మాటల యుద్ధంతో కూడా ఉత్సాహాన్ని నింపింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రెండు బౌండరీలు కొట్టిన తర్వాత వారి స్కోరింగ్ రేట్ నెమ్మదించింది.

దీన్ని గమనించిన ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ పంత్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. డకెట్ పంత్ దగ్గరికి వచ్చి, “మీరు డ్రా కోసం ఆడుతున్నారా?” అని క్వశ్చన్ చేశాడు. భారత్ ఆడుతున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తాడు. అయితే, పంత్ ఏమాత్రం కంగారు పడలేదు. చిరునవ్వుతో తల ఊపుతూ మీరు కూడా అలాగే ఆడుతున్నారా? అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో డకెట్, ఇంగ్లాండ్ జట్టు ఆశ్చర్యపోయారు.

పంత్ ఆన్సర్ ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజు ఆటను గుర్తు చేసింది. ఆ రోజు డకెట్, జైక్ క్రాలీ కలిసి మొదటి 13 ఓవర్లలో కేవలం 39 పరుగులే చేశారు. ఇది వారి బాజ్‌బాల్ స్టైల్‌కు చాలా భిన్నంగా ఉంది. పంత్ తన బ్యాట్‌తోనే కాకుండా పంచ్ లతో కూడా డకెట్‌ నోరు మూయించాడు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..