Jasprit Bumrah : సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో బూమ్రా.. తొలి బౌలర్‎గా రికార్డ్ ఖాయం

Jasprit Bumrah : భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇది పరుగుల సెంచరీ కాదు, వికెట్ల సెంచరీ రికార్డు. ప్రస్తుతం బుమ్రాకు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 99 వికెట్లు ఉన్నాయి.

Jasprit Bumrah : సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో బూమ్రా.. తొలి బౌలర్‎గా రికార్డ్ ఖాయం
Jasprit Bumrah

Updated on: Dec 09, 2025 | 6:57 AM

Jasprit Bumrah : భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇది పరుగుల సెంచరీ కాదు, వికెట్ల సెంచరీ రికార్డు. ప్రస్తుతం బుమ్రాకు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 99 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఒక్కే ఒక్క వికెట్ తీస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్ టీ20లో 100 వికెట్లు తీసినప్పటికీ, మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన భారత బౌలర్ ఎవరూ లేకపోవడం విశేషం.

జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్‌లలో 100 వికెట్ల మార్క్‌ను దాటేశాడు. గణాంకాలను పరిశీలిస్తే.. టెస్ట్ క్రికెట్‌లో 52 మ్యాచ్‌లలో 234 వికెట్లు తీసుకున్నాడు, వన్డే క్రికెట్‌లో 89 మ్యాచ్‌లలో 149 వికెట్లు పడగొట్టాడు. T20 ఫార్మాట్‌లో ప్రస్తుతం 99 వికెట్లతో, బుమ్రా కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధిస్తే మూడు ఫార్మాట్లలోనూ 100 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా బుమ్రా పేరు భారత క్రికెట్ చరిత్రలో సుస్థిరం అవుతుంది.

దక్షిణాఫ్రికాపై బుమ్రా గత రికార్డులు చూస్తే టీ20 ఫార్మాట్‌లో అతనికి అంతగా అచ్చిరాలేదు. బుమ్రా ఇంతకుముందు దక్షిణాఫ్రికాపై 3 టీ20 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే బుమ్రా తన టీ20 కెరీర్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియాపై 20 వికెట్లు, న్యూజిలాండ్‌పై 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మొదటి టీ20 మ్యాచ్ వివరాల విషయానికి వస్తే ఈ మ్యాచ్ మంగళవారం, డిసెంబర్ 9న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది (టాస్ 6:30 గంటలకు). ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

ఇరు జట్ల స్క్వాడ్‌లు

భారత్ స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్) తదితరులు.

దక్షిణాఫ్రికా స్క్వాడ్: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రెజా హెండ్రిక్స్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎన్రిక్ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి తదితరులు.