Ishan Kishan: హాఫ్ సెంచరీతో ఇషాన్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన ఛోటా ప్యాకెట్..

టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. 6.3 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. వారు ఇప్పటికే యాభై పరుగులు సాధించారు. ఇషాన్ 27 బంతుల్లో యాభై పరుగులు సాధించాడు.

Ishan Kishan: హాఫ్ సెంచరీతో ఇషాన్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన ఛోటా ప్యాకెట్..
Ishan Kishan

Updated on: Feb 15, 2026 | 8:08 PM

Ishan Kishan: కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్ vs పాకిస్తాన్ zw20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. 6.3 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. వారు ఇప్పటికే యాభై పరుగులు సాధించారు. ఇషాన్ 27 బంతుల్లో యాభై పరుగులు సాధించాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ఈ ఫోర్లు కిషన్ వరుసగా రెండో అర్ధ సెంచరీని సాధించడానికి సహాయపడ్డాయి. అయితే, 77 పరుగులు తర్వాత పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఇషాన్ 10 ఫోర్లు, 3 సిక్స్ లు బాదాడు.

పొట్టి ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు తరపున విరాట్ కోహ్లీ రెండు అత్యధిక స్కోర్‌లను కలిగి ఉన్నాడు. 2022లో 82*, 2012లో 78*లో చేశాడు.

పాకిస్తాన్ vs భారతదేశం తరపున అత్యధిక టీ20I వ్యక్తిగత స్కోర్లు..

1. విరాట్ కోహ్లీ – 82* (మెల్బోర్న్, 2022)

2. విరాట్ కోహ్లీ – 78* (కొలంబో, 2012)

3. ఇషాన్ కిషన్ 77 (కొలంబో, 2026)

4. గౌతమ్ గంభీర్ – 75 (జోహన్నెస్‌బర్గ్, 2007)

5. అభిషేక్ శర్మ – 74 (దుబాయ్, 2025)

మొదటి ఓవర్ చివరి బంతికి సల్మాన్ అలీ ఆఘాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మిశ్రమ ఆరంభం లభించింది. జట్టు అభిషేక్ శర్మను ఒక పరుగుకే కోల్పోయింది. ఆ తర్వాత, ఇషాన్, తిలక్ వర్మ జోడీ పవర్ ప్లేలో జట్టును 50 పరుగులు దాటించింది. అలాగే యాభై పరుగుల భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశారు.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.